Friday, February 6, 2026 12:22 AM
Friday, February 6, 2026 12:22 AM

ఆ 4 నియోజకవర్గాల ప్రజల కల నెరవేరే వేళ..!

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు పాలకులు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు వైసీపీ సర్కార్ కనీసం ఒక్క మంచి కూడా చేయలేదు అనేది ఎన్నికల సమయంలో కూటమి నేతల ఆరోపణ. ఇందులో ప్రధానంగా రహదారుల మరమ్మతు. గ్రామీణ మార్గాలతో పాటు ప్రధాన రహదాలను కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రధాన నగరాల మధ్య ప్రయాణం కూడా నరకప్రాయంగా మారిపోయింది. నిత్యం రద్దీగా ఉండే మార్గాల్లో కూడా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేశారు. అలాంటి రహదారుల్లో ఒకటి విజయవాడ – కంకిపాడు – మానికొండ – నందమూరు – వెంట్రాప్రగడ – గుడివాడ మార్గం ఒకటి.

Also Read : వర్మ తెలివి పోసానికి లేకుండా పోయిందే..!

వరుసగా నాలుగు సార్లు గెలిచినప్పటికీ… మంత్రిగా వ్యవహరించినప్పటికీ.. ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు మాజీ మంత్రి కొడాలి నాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయావాడ నుంచి గుడివాడకు కంకిపాడు, మానికొండ మీదుగా కేవలం 42 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ మార్గం పెనమలూరు, గన్నవరం, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల మీదుగా ప్రయాణిస్తుంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే మార్గం. రహదారికి రెండు వైపులా కాలువలు ఉండటం వల్ల రహదారి పూర్తిగా కుంగిపోతుంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చినప్పటికీ.. కనీసం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఈ మార్గం మీదుగా ప్రయాణించకుండా… ఉయ్యూరు, పామర్రు మీదుగా ప్రయాణించారు తప్ప… మానికొండ, వెంట్రాప్రగడ వైపు వస్తే ప్రజలు నిలదీస్తారనే భయంతో ఆ వైపు రాలేదు.

Also Read : మౌనమే.. విజయసాయి రెడ్డిపై సైలెంట్ గా వైసీపీ

ఈ రహదారి మరమ్మతులపై అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రస్తావించారు. సాధ్యమైనంత వేగంగా రహదారి మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రెండు వైపులా కాలువలు ఉండటం వల్ల కుంగిపోతుందని.. దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధిత శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా జవాబిచ్చారు. దీనిపై సంబంధిత శాఖ మంత్రి జవాబిచ్చారు. CRIF కింద రూ.16 కోట్లతో గుడివాడ – కంకిపాడు మార్గం అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ పని ఏప్రిల్ 26 లోపు పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా SDMF కింద రూ.5 కోట్లు కూడా కేటాయించామన్నారు. గుడివాడ – కంకిపాడు రోడ్డులో 11వ కి.మీ. నుంచి 15వ కి.మీ. వరకు రూ.40 లక్షలతో అత్యవసర పనుల కింద మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. గుడివాడ – కంకిపాడు మధ్య 15వ కి.మీ నుంచి 25వ కి.మీ వరకు రూ.రెండున్నర కోట్లతో పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ పనులన్నీ మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో కనీసం ఒక్క లేయర్ కూడా వేయలేదని… గుంత కూడా పూడ్చలేదన్నారు మంత్రి జనార్థన్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1800 కోట్లతో రహదారి మరమ్మతులు చేస్తున్నామన్నారు. మంత్రి జవాబుతో 4 నియోజకవర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.....

కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమల లడ్డూ...

తెలంగాణకు ఎవరు జాతిపిత..?

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా...

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి...

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో...

మల్లన్న దగ్గర కూడా...

2019 నుంచి 2024 వరకు ఏపీలో...

వాళ్లను ఎందుకు అరెస్టు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

పోల్స్