Sunday, March 22, 2026 06:42 AM
Sunday, March 22, 2026 06:42 AM

టాలీవుడ్‌లో సంక్రాంతి భయం..!

టాలీవుడ్‌లో అతిపెద్ద సినిమా పండుగకు సమయం ఆసన్నమైంది. సంక్రాంతి, దసరా పండుగలకు పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం టాలీవుడ్ ఆనవాయితీ. అయితే ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే.. ఆ సినిమా విడుదలైన వారం రోజుల వరకు మరే సినిమా కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు రారు. ఇందుకు ప్రధాన కారణం.. పెద్ద హీరో సినిమా కలెక్షన్ తగ్గింపోతుందనే భయంతో పాటు.. పెద్ద హీరో సినిమా రిలీజ్ తర్వాత తగినన్ని థియేటర్లు అందుబాటులో ఉండవనే భయం కూడా. ఇందుకు గతేడాది చివర్లో విడుదలైన అఖండ 2 ప్రత్యక్ష ఉదాహరణ. ముందు డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆగిపోవడంతో.. ఆ వారం కొత్త సినిమా అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో.. ముందుగానే ఆ తేదీ విడుదలకు సిద్ధమైన మోగ్లీ వంటి సినిమాలు ఒకరోజు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం సినిమా పండుగతో థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది.

Also Read : బెజవాడ నుంచి అమరావతి వెళ్ళే వారికి గుడ్ న్యూస్..!

ఈ సంక్రాంతికి 9 రోజుల పాటు సెలవులిస్తు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటనలు చేశాయి. ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించారు. దీంతో సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే అంతా ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. సంక్రాంతి వారం రోజులు ప్రేక్షకులను థియేటర్లలోనే కట్టిపడేయాలని టాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. ముందుగా ప్రభాస్ హీరోగా వస్తున్న రాజాసాబ్ జనవరి 9న విడుదల కానుంది. ఆ తర్వాత చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్… జనవరి 12న విడుదల కానుంది. జనవరి 14న శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు విడుదలవుతోంది. రవితేజ హీరోగా వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా ఈ సంక్రాంతి రేసులోనే ఉంది. నిజానికి వీటిల్లో ఏ ఒక్కటి చిన్న సినిమా కాదు. ఐదుకు ఐదు సినిమాలు భారీ బడ్జెట్‌తో, స్టార్ కాస్టింగ్‌తో, పెద్ద బ్యానర్లు నిర్మించిన సినిమాలే. ప్రభాస్ సినిమా 2 వేల కోట్లు వసూలు చేస్తుందని ఇప్పటికే మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కూడా.

Also Read : ప్రపంచ క్రికెట్‌ ను శాసించే స్థాయిలో కొత్త స్టేడియాలు..!

ఓ వైపు సినిమాల రిలీజ్‌ తేదీలు దగ్గర పడుతుండగా.. నిర్మాతల్లో, అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈ ఐదు సినిమాలకు సరిపడా థియేటర్లు ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఏ సినిమా అయినా సరే.. 3 రోజుల పాటు అన్ని స్ర్కీన్స్‌లలో ప్రదర్శిస్తేనే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్‌కు నాలుగు డబ్బులు వస్తాయి. అదే సమయంలో బడ్జెట్ ఆధారంగా టికెట్ ధరలు పెంచుకుంటేనే నిర్మాతకు మేలు జరుగుతుంది కూడా. లేదంటే.. ఆ నాలుగు రోజులు దాటితే.. ప్రేక్షకులు సినిమా థియేటర్ వైపు వచ్చే పరిస్థితి ఉండదనేది సినీ వర్గాల మాట. అందుకే సాధ్యమైనన్ని స్క్రీన్‌లపైన తన సినిమా ఉండేలా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో టికెట్ ధరలు భారీగా ఉంటే.. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చే పరిస్థితి ఉండదని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నలుగురున్న కుటుంబ సభ్యులు సినిమా చూడాలంటే కనీసం రూ.2 వేలు ఖర్చు అవుతుందని.. మరి పెద్ద సినిమాలు థియేటర్‌లో చూడాలంటే.. ఈ బడ్జెట్ రూ.10 వేలు దాటుతుందన్నారు. ఒక్క నెలలోనే అంత ఖర్చు.. అది కూడా సినిమాలకు పెట్టేందుకు సగటు మధ్య తరగతి కుటుంబం సిద్ధంగా లేదంటున్నారు. కాబట్టి అందుబాటు ధరల్లో సినిమా టికెట్లు ఉంచితేనే థియేటర్లకు ఎక్కువ మంది వచ్చి సినిమా చూస్తారంటున్నారు. అలాంటి చర్యలు తీసుకోకపోతే.. తర్వాత వచ్చే సినిమాలకు ప్రేక్షకాదరణ పెద్దగా ఉండదని హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై టాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్