Wednesday, February 18, 2026 07:49 PM
Wednesday, February 18, 2026 07:49 PM

కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించే నాలుగు రాష్ట్రాలు..!

దేశంలో పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పడుతున్న కష్టాలు.. ఆ పార్టీ సుధీర్గ రాజకీయ చరిత్రలో ఏ నాడు పడలేదు అనే మాట వాస్తవం. కేంద్రంలో అధికారం కోల్పోవడమే కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. అయితే రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం భారీ ఆశలే పెట్టుకుంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏప్రిల్/మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Also Read : నా దుడ్లుతో కొనుక్కున్నా.. వైసీపీకి లోకేష్ మార్క్ కౌంటర్..!

ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అనుకూల పవనాలే కనపడుతున్నాయి. గత సంవత్సరం జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికలు ఢిల్లీ, బీహార్ లో పరాజయాల తర్వాత, ముఖ్యంగా 2029 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా నిలబడటానికి కనీసం రెండు రాష్ట్రాల్లో అయినా విజయం సాధించాల్సి ఉంటుంది. కానీ అది అంత సులభం కాదనే చెప్పాలి. డిసెంబర్ 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో కేరళలో పార్టీ మంచి విజయం సాధించే సంకేతాలు కనపడుతున్నాయి.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్పొరేషన్.. మునిసిపాలిటీ, పంచాయతీ ఎన్నికలలో కలిపి 38 శాతానికి పైగా ఓట్లను సాధించింది. ఇదే ఆ పార్టీకి జోష్ ఇచ్చే అంశం. పొరుగున ఉన్న తమిళనాడులోనూ వాతావరణం ఉత్సాహంగా కనపడుతోంది. అధికార డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఇక్కడ అన్నాడిఎంకే బలహీనంగా ఉండటం కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం. అయితే, బెంగాల్, అస్సాంలలో కథ చాలా భిన్నంగా ఉంటుంది. బెంగాల్‌ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బిజెపిలకు ఇక్కడ బలం కనపడుతోంది.

Also Read : ఎలా ఉండే వాడు.. ఎలా అయిపోయాడు..!

ఆ పార్టీలపై కాంగ్రెస్ ఒంటరిగా పోరాటం చేసే పరిస్థితి. 2021 ఎన్నికల్లో పోటీ చేసిన 91 సీట్లలో ఒక్కటి కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపాలని పట్టుదలగా ఉంది. అస్సాం విషయానికి వస్తే.. అధికార బిజెపిని ఎదుర్కొనే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రస్తుతం 29 సీట్లను కాపాడుకోవాలి. ఆ 29 సీట్లను నిలుపుకోవడంతో పాటుగా అధికారంలోకి రావాల్సి ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అన్నీ తెలిసే ఆడుకుంటున్నారు.....

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి....

ఆ నేతకు బ్రేకులు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నాయి....

ఎలా ఉండే వాడు.....

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన...

పాపం చేస్తే చివరి...

ఏపీలో దారుణాలకు పాల్పడిన వారికి అదే...

నా దుడ్లుతో కొనుక్కున్నా.....

రాజకీయాల్లో ప్రత్యర్ధులను టార్గెట్ చేయడమనేది సహజమే....

మరోసారి అడ్డంగా దొరికిపోయిన...

"వీడెవడండి.. వాడిని వాడే ఎధవ అనేసుకుంటున్నాడు.."...

పోల్స్