Wednesday, February 4, 2026 11:13 AM
Wednesday, February 4, 2026 11:13 AM

ఏపీలో సీనియర్ల వైరాగ్యం.. రాజకీయాలకు గుడ్ బై..?

ఇటీవలి కాలంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేతలు సాధారణంగా విరమణకు ఆసక్తి చూపరనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. పలువురు సీనియర్ నేతలు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడమే కాకుండా, తన కుమారుడు రాఘవను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇదే తరహాలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా 2029 ఎన్నికల నుంచి తప్పుకోవాలన్న భావనలో ఉన్నట్లు సమాచారం.

Also Read :ఐఏఎస్ భార్య మృతి.. ఎన్నో అనుమానాలు..!

అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా రాజకీయాల నుంచి విరమించుకునే నిర్ణయానికి దగ్గరగా వచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను ఎప్పుడో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నప్పటికీ, ప్రజల కోరిక మేరకు 2024 ఎన్నికల్లో పోటీ చేశానని ఆయన తెలిపారు. అనూహ్యమైన మెజారిటీతో గెలిచినప్పటికీ, భవిష్యత్తులో తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు.

Also Read : చంద్రబాబు కష్టాన్ని గుర్తించడంలో క్యాడర్ విఫలమైందా?

ఇకపై ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే మంచి పేరు సంపాదించుకోవాలని భావిస్తున్నట్లు కామినేని పేర్కొన్నారు. అదే సమయంలో తన నియోజకవర్గంలో అక్రమాలు, అన్యాయాలు జరిగితే ఎవరికీ మినహాయింపు ఉండదని హెచ్చరించారు. సీనియర్ నేతల రాజకీయ విరమణ వెనుక పార్టీల్లో యువ నాయకత్వానికి పెరుగుతున్న ప్రాధాన్యత ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పదవులు, అవకాశాలు యువ నేతలకే ఎక్కువగా దక్కుతుండటంతో అనుభవజ్ఞులు పక్కకు తప్పుకుంటున్నారన్న విశ్లేషణ వినిపిస్తోంది.

Also Read : క్యాన్సర్ రోజులపై యువరాజ్ సంచలన విషయాలు..!

ఇదే ధోరణిలో భవిష్యత్ ఎన్నికల బరిలో నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, కె.ఎస్. జవహర్, గంటా శ్రీనివాసరావు వంటి మరికొందరు సీనియర్ నేతలు కూడా దూరంగా ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే గంటా తన వారసుడి రాజకీయ ప్రవేశం పై నర్మగర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కొందరు నేతలు వారసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికే సిద్ధమవుతున్నట్లు పరిస్థితులు సూచిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

పోల్స్