Sunday, March 22, 2026 04:38 AM
Sunday, March 22, 2026 04:38 AM

మద్యం కేసులో పీకల్లోతు ఇరుకున్న పెద్దన్న..!

భారతదేశ చరిత్రలో లిక్కర్ మాఫియా కేసు అవినీతి కనీవినీ ఎరుగని రీతిలో జరిగిందని ఏకంగా పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. అప్పటి వరకు ఉన్న మద్యం విధానానికి స్వస్తి పలికిన జగన్ మోహన్ రెడ్డి.. కొత్త పాలసీని అమలు చేశారు. ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయిస్తుందని.. కాబట్టి ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని గొప్పగా ప్రకటించారు. కానీ ఎక్కడా డిజిటల్ పేమెంట్ అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని ద్వారా సుమారు 5 వేల కోట్లు క్యాష్ చేతులు మారిందని లావు ఆరోపించారు. దీంతో ప్రభుత్వం ఈ అవినీతిపై నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది.

Also Read : రాజా సాబ్ షూటింగ్ ఇష్యూస్.. చేతులెత్తేసిన నిర్మాత

వైసీపీ పాలనలో 2019లో రూ.17,473 కోట్లు, 2020లో రూ.17,890 కోట్లు.. 2021లో రూ.21,432 కోట్లు.. 2022లో రూ.23,785 కోట్లు.. 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు రూ.20,964 కోట్ల వసూళ్లను జగన్ సర్కార్ చూపింది. సుమారు లక్ష కోట్ల మద్యం సొమ్ముకు క్యాష్‌ను రాజమార్గంగా ఎంచుకున్నారు. సాధారణంగా ప్రస్తుతం 2 లక్షల రూపాయల నగదుకు మించి ఎవరి దగ్గర ఉండకూడదు. అలా ప్రయాణం చేయాలంటే అందుకు తగిన ధృవీకరణ తప్పనిసరి. మరి ప్రతి రోజూ వైన్ షాపుల వద్ద వసూలైన నగదును ఎలా తరలించారనేది ఇప్పటికీ అర్థం కావటం లేదు. అలా తరలిస్తుంటే పోలీసులు, అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.

Also Read : గ్రహాంతరవాసులపై భారత్ – జపాన్ అదిరిపోయే ప్రాజెక్ట్..

ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను, నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నాడు జరిగిన లావాదేవీలపై అధికారులు దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య కాలంలో మద్యం వసూళ్లు రూ.23,988 కోట్లుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇది వైసీపీ సర్కార్ హయాం కంటే కూడా 14.5 శాతం ఎక్కువ. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఏడాదిలోనే కొత్తగా 14.5 మంది మందుబాబులు వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నాటికి నేటికి 14.5 శాతం తేడా రావటం వెనుక కారణాలేమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

14.5 శాతం అనేది చిన్న లెక్క కాదంటున్నారు సెట్ అధికారులు. దీని వెనుక చాలా పెద్ద కుంభకోణం జరిగిందని గుర్తించారు. ప్రతి ఏటా 3 వేల కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు సిట్ బృందం అనుమానిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. త్వరలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్