Sunday, March 22, 2026 06:24 AM
Sunday, March 22, 2026 06:24 AM

మంత్రుల మెడపై సోషల్ మీడియా కత్తి..!

ఈరోజుల్లో రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర అనేది ఎంత కీలకంగా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రజల్లో ఎంత తిరుగుతున్నారు అనే దానికంటే సోషల్ మీడియాలో ఎంత హడావిడి చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. పనిచేయడం కంటే ప్రచారం చేసుకోవడం ముఖ్యంగా మారిపోయింది రాజకీయం. 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమికి సోషల్ మీడియా బలంగా లేకపోవడమే ప్రధాన కారణం అనేది అప్పట్లో ఎక్కువగా వినపడింది. అయితే 2019 తర్వాత నుంచి టీడీపీ అధిష్టానం సోషల్ మీడియా విషయంలో ఎక్కువగా ఫోకస్ పెట్టింది.

Also Read : మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి.. తమ మంత్రులు ఎమ్మెల్యేలకు సోషల్ మీడియా పై పూర్తిస్థాయిలో దిశా నిర్దేశం చేస్తుంది. ర్యాంకింగ్ సిస్టం పెట్టడంతో ఇప్పుడు మంత్రులు సోషల్ మీడియాపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఏడాది క్రితం మంత్రులు సోషల్ మీడియాపై దృష్టి సారించడం లేదని కొంతమంది మంత్రులను సీఎం చంద్రబాబు క్యాబినెట్ సమావేశంలో తప్పుపట్టారు. ఇక అక్కడి నుంచి మంత్రులు సోషల్ మీడియా కోసం ప్రత్యేక బృందాలను సైతం నియమించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ర్యాంకింగ్ తగ్గితే సీఎం నేరుగా వార్నింగ్ ఇవ్వటంతో మంత్రులు సోషల్ మీడియాలో ఎక్కువగా కనపడేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు.

Also Read : మంత్రుల మాటకు విలువ ఎక్కడ..?

ముఖ్యంగా కొత్త మంత్రులు పనితీరును మెరుగుపరచుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు నానా కష్టాలు పడుతున్నారు. దీనిపై పార్టీ ఆఫీస్ లో ఒక టీం ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తోంది అధిష్టానం. ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యక్రమాల నుంచి ప్రతి ఒక్కటి.. ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం చేసుకోవాలని దిసా నిర్దేశం చేస్తున్నారు. దాదాపుగా మంత్రులందరూ ప్రత్యేక ఏజెన్సీలు నియమించుకున్నారు. ఆఫీసుల్లో సోషల్ మీడియా కోసమే ప్రత్యేక టీం కూడా రెడీ చేసుకోవడం గమనార్హం. ప్రతి క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం అంశం చర్చకు రావడం.. సోషల్ మీడియా అంశం గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించడం.. అటు మంత్రి నారా లోకేష్ సైతం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంతో మంత్రుల్లో సోషల్ మీడియా పై భయం ఓ రేంజ్ లో కనబడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్