Sunday, March 22, 2026 04:34 AM
Sunday, March 22, 2026 04:34 AM

పాపం ఎమ్మెల్యే.. కొత్త నేత దెబ్బకు ఉక్కిరిబిక్కిరి

అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అనే సామెత టిడిపిలో పక్కాగా వర్కౌట్ అవుతుంది. పార్టీ కోసం కష్టపడిన నాయకులు కంటే పార్టీ మారి కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వారికి ఉండే ప్రాధాన్యత వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు కోస్తా లో ఓ మంత్రి గారి తంతు ఇలాగే ఉంది అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కీలక పదవిలో ఉన్న సదరు నేత.. ఆయన సొంత జిల్లాలో పాత పరిచయాలకు ఇస్తున్న ప్రాధాన్యత విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఆయన ఆశీస్సులతో అప్పట్లో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన కొందరు.. చేసిన కొన్ని చేష్టలపై టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : తమిళం నేర్చుకుంటున్న పవన్.. బిగ్ ప్లాన్ తో పొలిటికల్ స్టెప్స్

వైసీపీ ప్రభుత్వంలో తాము విమర్శలు చేసామని.. కానీ సదర నేత ఇప్పుడు అటువంటి కార్యక్రమాలనే ప్రోత్సహిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక ఓ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు సదరు నేత పవర్ చూసి సైలెంట్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. కనీసం ఎమ్మెల్యే మాటకు పోలీసులు విలువ ఇవ్వటం లేదు అని.. ఎమ్మెల్యే చెప్తే కనీసం పోలీసులు పట్టుకున్న బండి కూడా వదలడం లేదని కార్యకర్తల్లో కొంత ఆవేదన కనబడుతోంది. పార్టీ కోసం కష్టపడిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లుగా నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. కీలక పదవిలో ఉన్న ఆ నేత డామినేషన్ దెబ్బకు టిడిపి కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Also Read : మాటల మాంత్రికుడి డైరెక్షన్ లో నందమూరి వారసుడు

ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఓ గ్రామంలో ఏకంగా వైసిపి కార్యకర్తలే ఆయనకు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఆయన కీలక పదవిలో ఉండటం.. పాత పరిచయాలకు మంచి ప్రయారిటీ ఇవ్వటంతో.. టిడిపి కార్యకర్తలు మౌనంగా రోదించే పరిస్థితి ఏర్పడింది. కేసులు పెట్టించుకుని, పార్టీ కోసం రోడ్లమీద తిరిగి, ఆర్థికంగా నష్టపోయిన తమకు ఈ పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడుల పేరుతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఎందరో కార్యకర్తలు చర్చించుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టి కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కేల చూడాలంటూ కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్