Saturday, April 11, 2026 07:27 PM
Saturday, April 11, 2026 07:27 PM

రాజ్యసభ రచ్చ.. ఎవరిని వరిస్తుందో..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీట్ల కేటాయింపు అంశం తీవ్ర చర్చకు దారితీసింది. జూన్‌లో ఖాళీ కానున్న నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి అవకాశం కల్పిస్తారన్నదానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. టీడీపీ ఐటీ విభాగంలో చురుగ్గా వ్యవహరించిన చింతకాయల విజయ్ పేరు ప్రస్తుతం రేసులో ముందంజలో ఉంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో పాటు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న వ్యూహం కారణంగా విజయ్‌కు అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కష్ట కాలంలో చేసిన సేవలకు ఇది గుర్తింపు అవుతుందనే అభిప్రాయం క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.

Also Read : తలనొప్పిగా మారిన క్లీన్ పాలిటిక్స్ నినాదం..!

పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన యనమల రామకృష్ణుడు కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆయనకు ఉన్న అనుభవం, ట్రబుల్ షూటర్‌గా ఉన్న ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తే ఆయనకు అవకాశం దక్కే అవకాశముంది. కానీ ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన గుండెకు సంబంధించి స్టంట్ కూడా వేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కూడా. అయితే యువతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్లకు ఎంత ప్రాధాన్యం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

గతంలో రాజకీయాలకు దూరంగా ఉన్న గల్లా జయదేవ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంటరీ అనుభవం, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నెట్‌వర్క్ కారణంగా పార్టీకి ఆయన సేవలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇతర ఆశావహులు కూడా రేసులో ఉన్నారు. రాజ్యసభ సీట్ల కోసం మరికొంత మంది నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, మహాసేన రాజేష్ వంటి నాయకులు ఈ వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలు వీరి అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి.

Also Read : అమెరికాకు కోలుకోలేని దెబ్బ.. రూ.12 వేల కోట్ల ట్రైటన్ డ్రోన్ మిస్సింగ్..!

అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం మూడు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. పార్టీకి కష్ట కాలంలో విధేయంగా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందనేది ఇప్పటికే స్పష్టమైంది. బీసీ, ఎస్సీ, కాపు వర్గాలకు సమతుల్యత ఉంటుందని భావిస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్ర వాణిని బలంగా వినిపించే సామర్థ్యం ఆధారంగా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక రాజ్యసభ సీట్ల కేటాయింపులో మిత్రపక్షాల పాత్ర కూడా కీలకంగా మారింది. భారతీయ జనతా పార్టీ ఒక సీటు కోరే అవకాశం ఉండగా, జనసేన పార్టీకి అవకాశం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ మరింత పెరిగింది. యువతకు ప్రాధాన్యమా? సీనియర్లకు గౌరవమా? సామాజిక సమీకరణాలే నిర్ణాయకమా? అన్నదానిపై చంద్రబాబు తీసుకునే తుది నిర్ణయం రాజకీయంగా కీలకం కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేసీఆర్ యుద్ధం షురూ.....

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాల దిశగా...

ఆర్టీసీ ఉద్యోగుల కోసం...

ఈ మధ్య కాలంలో గుండెపోటు అనే...

వైసీపీపై షర్మిల విశ్వరూపం.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

దేశ చరిత్రలోనే తొలిసారి.....

భారత ఎన్నికల వ్యవస్థలో విమర్శలకు వేదికగా...

బీ అలర్ట్.. మెయిన్...

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ...

బ్రేకింగ్: సింగర్ మంగ్లీపై...

ప్రముఖ గాయని మంగ్లీ మరో వివాదంలో...

పోల్స్