Thursday, March 26, 2026 01:37 PM
Thursday, March 26, 2026 01:37 PM

పీవీ సునీల్ కుమార్ మతం వివాదం.. ముదురుతున్న కుల రచ్చ.. !

ఏపీ మాజీ సీఐడీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చుట్టూ ఉన్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గతంలో నాటి ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టడోడియల్ టార్చర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఆయనపై, ఇప్పుడు మతం, కులానికి సంబంధించిన వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు, సునీల్ కుమార్ మతంపై సంచలన ఆరోపణలు చేశారు. సునీల్ కుమార్ క్రైస్తవ మతానికి చెందినవాడని, కానీ ఐపీఎస్ ఉద్యోగాన్ని మాత్రం దళిత కోటాలో పొందారని ఆయన ఫిర్యాదు చేశారు.

Also read : ఒకప్పుడు రాజస్థాన్ ప్లేయర్.. ఇప్పుడు ఆర్సీబీ బాస్..!

ఇటీవల సుప్రీం తీర్పు ఆధారంగా.. ఒక వ్యక్తి క్రైస్తవ మతం స్వీకరించిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు అనుభవించడం రాజ్యాంగ విరుద్ధమని రఘురామ వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై డీవోపీటీకి రఘురామ ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ తన సర్వీస్ రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన కుల ధ్రువీకరణ పత్రంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ ఇది నిజమని తేలితే, ఆయన సర్వీస్, రిటైర్మెంట్ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also read : షుగర్ లెవల్స్ పెరగకుండా కడుపు నిండాలా..? అయితే ఇది తినండి..!

సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారిగా ఉంటూనే రాజకీయ, కులపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కాపు నాయకుడు ముఖ్యమంత్రిగా, దళిత నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఆయన చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసుల నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులు అందాయి. అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్థను ఆయన నడుపుతోన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ద్వారా మతపరమైన ప్రచారాలు చేస్తున్నారని గతంలోనే కేంద్ర హోం శాఖకు నివేదికలు అందాయి. ఇక పీవీ సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ పొడిగించిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెద్దిరెడ్డికి బిగుస్తోన్న ఉచ్చు.....

వైసీపీ హయాంలో అన్నీ తానై చెలరేగిపోయి.....

ఘోర ప్రమాదం.. కాలి...

మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

ముస్తాబైన ఒంటిమిట్ట.. అంగరంగ...

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉమ్మడి...

బ్రేకింగ్: రాజధానిలో ఏం...

అమరావతి రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న...

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్...

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది...

బ్రేకింగ్; ఏపీలో మున్సిపల్...

ఏపీలో స్థానిక సంస్థల సమరానికి మున్సిపల్...

పోల్స్