Wednesday, February 4, 2026 07:38 PM
Wednesday, February 4, 2026 07:38 PM

కల సాకారం.. కానీ ఎన్నో అనుమానాలు..?

కొత్త జిల్లాల ఏర్పాటుపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న 26 జిల్లాల సంఖ్య 29 జిల్లాలకు పెరగనుంది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ నెరవేరడంతో.. మార్కాపురం ప్రాంత వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.

Also read : బ్రేకింగ్: గోదావరి పుష్కరాల తేదీలు ఇవే.. చంద్రబాబు ఖాతాలో హ్యాట్రిక్ రికార్డ్..!

ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో మార్కాపురం రెవెన్యూ డివిజన్ భాగంగా ఉంది. నిజానికి కర్నూలు జిల్లా నుంచి మార్కాపురం డివిజన్ వేరు చేసి ప్రకాశం జిల్లాలో కలిపారు. అయితే భౌగోళికంగా మార్కాపురం ప్రాంతం జిల్లా కేంద్రానికి దూరంగానే ఉంది. అటు గిద్దలూరు, ఇటు యర్రగొండపాలెం, పుల్లలచెరువు, దోర్నాల మండలాల ప్రజలు జిల్లా కేంద్రం ఒంగోలు వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసలు పడాల్సిందే. దీనికి మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు మాత్రమే ఏకైక పరిష్కారం అని డిమాండ్ చేశారు. చివరికి ఆ కల సాకారమైంది.

Also read : నేనేంటో త్వరలో చూస్తారు.. ఆ జిల్లా నేతలకు చంద్రబాబు వార్నింగ్..!

అయితే ఇక్కడే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలనేది తొలి నుంచి ఉన్న ప్రతిపాదన. అదే సమయంలో నంద్యాల జిల్లాలో భాగంగా ఉన్న శ్రీశైలం, సుండిపెంట ఊర్లను కూడా మార్కాపురం జిల్లాలో కలపాలనే డిమాండ్ చాలా రోజులుగా ఉంది. అయితే ఈ డిమాండ్‌పై నంద్యాల జిల్లా వాసులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అంగీకారం తెలిపిన ప్రభుత్వం శ్రీశైలంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇక దర్శి నియోజకవర్గం మార్కాపురంలో కలపటంపై దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమకు ఒంగోలు దగ్గరని.. మార్కాపురం దూరం కాబట్టి.. అలాగే ఉంచాలంటున్నారు. కానీ దొనకొండ, కురిచేడు మండలాల ప్రజలు మాత్రం మార్కాపురం దగ్గర కాబట్టి.. ఏ అభ్యంతరం లేదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మార్కాపురం జిల్లా కల సాకారమైనప్పటికీ.. ఎన్నో అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్