Thursday, March 26, 2026 02:15 PM
Thursday, March 26, 2026 02:15 PM

బ్రేకింగ్: జగన్ కు పెమ్మసాని డెడ్లీ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, కూటమి నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడంపై పెమ్మసాని ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ, అవి వ్యక్తిగత స్థాయికి దిగజారకూడదని హితవు పలికారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ.. చంద్రబాబు గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ హెచ్చరించారు. మాకు సంస్కారం ఉందనే ఇప్పటివరకు ఆగుతున్నామన్నారు.

Also Read : పెద్దిరెడ్డికి బిగుస్తోన్న ఉచ్చు.. గురిపెట్టి కొట్టిన సర్కార్..!

అంతేకానీ మా చేతకానితనం కాదు. జగన్ తన హద్దులు తెలుసుకొని మాట్లాడితే మంచిది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కూటమి నేతలను ఉద్దేశించి జగన్ మరియు ఆయన పార్టీ నేతలు చేస్తున్న బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై పెమ్మసాని ఘాటుగా స్పందించారు. నా గురించి లేదా మా నేతల బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే.. నిన్ను ఒక్క మాటతో చంపేయగలను. అంతటి వాగ్ధాటి నాకు ఉందని కౌంటర్ ఇచ్చారు. కానీ, నా పెరిగిన వాతావరణం, నా సంస్కారం నన్ను అడ్డుకుంటున్నాయి. నీలాగా నీచమైన రాజకీయాలు చేయడం మాకు రాదని మండిపడ్డారు.

Also Read : పీవీ సునీల్ కుమార్ మతం వివాదం.. ముదురుతున్న కుల రచ్చ.. !

జగన్ గారూ.. మీకు దమ్ముంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోండి… అభివృద్ధిపై చర్చించండి, ప్రజా సమస్యలపై మాట్లాడండని హితవు పలికారు. అంతే తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగి రాజకీయాలను భ్రష్టు పట్టించకండని పెమ్మసాని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తుంటే, జగన్ మాత్రం అసహనంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. పెమ్మసాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెద్దిరెడ్డికి బిగుస్తోన్న ఉచ్చు.....

వైసీపీ హయాంలో అన్నీ తానై చెలరేగిపోయి.....

పీవీ సునీల్ కుమార్...

ఏపీ మాజీ సీఐడీ చీఫ్, సీనియర్...

ఘోర ప్రమాదం.. కాలి...

మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

ముస్తాబైన ఒంటిమిట్ట.. అంగరంగ...

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉమ్మడి...

బ్రేకింగ్: రాజధానిలో ఏం...

అమరావతి రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న...

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్...

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది...

పోల్స్