పవన్ కల్యాణ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ తమ్ముడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన పవన్.. ఏపీ డిప్యూటీ సీఎంగా, ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్.. తన అభిమానులను మాత్రం నిర్లక్ష్యం చేయటం లేదు. సమయం వచ్చినప్పుడల్లా అభిమానులను కలుస్తూనే ఉన్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నారు. ఇక రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. తన ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తూనే ఉన్నారు. 2023లో బ్రో అంటూ పలకరించిన పవన్.. రెండేళ్ల విరామం తర్వాత వరుసగా రెండు సినిమాలతో ఫ్యాన్స్‌కు కనువిందు చేశారు. హరిహర వీరమల్లు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఓజీ మాత్రం.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి హైప్ క్రియేట్ చేసింది. దసరా సినిమాల్లో ఓజీ సూపర్ కలెక్షన్ రాబట్టింది.
Also Read : లోకేష్ పేరు వాడితే అంతే.. టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్..?
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ధీటుగా జవాబిచ్చారు పవన్. వారాహి యాత్రలతో తన ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. సినిమా డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు. పవన్ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో చూపించారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని 100 శాతం సక్సెస్ రేటు సాధించిన పార్టీగా రికార్డుల్లోకి ఎక్కారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పేరు ఎత్తడానికి కూడా వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారంటే.. పవన్ ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు వరుస సినిమాలతో దుమ్ము రేపుతున్నారు పవన్.
Also Read : తెలుగు నటి అరుదైన రికార్డు.. ప్రగతి విజయగాథ!
తాజాగా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమాను మైత్రీ మూవిస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం ఇప్పటి వరకు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. కానీ సడన్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో ఓ పాటను ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రొమోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చినప్పటికీ.. ఈ ప్రోమో అప్పుడే గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించింది. దేఖ్‌లేంగే సాలా పేరుతో రిలీజ్ అయిన ఈ పాటలో పవన్ స్టెప్స్ అదరగొట్టారు. చాలా ఏళ్ల తర్వాత పవన్ డ్యాన్స్ చేశారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్లో వవన్ ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్ చేయలేదు. ఉస్తాద్ ప్రోమోలో స్టెప్ ఏస్తే భూకంపం అంటూ డీఎస్పీ సాంగ్‌కు పవన్ స్టెప్స్ వేశారు. దీని ఫుల్ సాంగ్ ఈ నెల 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఆ రోజు ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

