Sunday, March 22, 2026 04:04 PM
Sunday, March 22, 2026 04:04 PM

ఎమ్మార్వో ఆఫీస్ కు మాగంటి ఫ్యామిలీ పంచాయతీ..!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం ఆసక్తి రేపుతోంది. ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన సర్వేల ప్రకారం చూస్తే ఇక్కడ భారత రాష్ట్ర సమితి విజయం సాధించే అవకాశం ఉండగా.. రెండవ స్థానంలో కాంగ్రెస్ మూడో స్థానంలో బిజెపి ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బీ ఆర్ ఎస్ గా పోరు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి సర్వే సంస్థలు.

Also Read : సార్ మీ స్కిన్ కేర్ ఏంటీ..? మోడీతో మహిళా క్రికెటర్ కామెంట్

ఈ నేపథ్యంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఎన్నికను మరింత ఆసక్తిగా మారుస్తున్నాయి. ముఖ్యంగా మాగంటి సునీత అభ్యర్థిత్వంపై.. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. అసలు మాగంటి సునీత.. గోపీనాథ్ భార్య కాదని.. తన తల్లికి విడాకులు ఇవ్వకుండా ఆమెతో సహజీవనం చేస్తున్నాడని తారక్ ఇటీవల ఓ సంచలన ప్రకటన విడుదల చేశాడు. ఇక ఇప్పుడు ఈ పంచాయతీ తాసిల్దార్ ఆఫీస్ కు చేరింది. శేర్లింగంపల్లి తాసిల్దార్ ఆఫీస్ లో.. మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి, మొదటి భార్య మాలినీ దేవి, కొడుకు తారక్, రెండో భార్య చిన్న కూతురు ప్రత్యక్షమయ్యారు.

Also Read : కల్తీ మద్యం: తాతల కాలం నుంచే జోగి – అద్దేపల్లి కుటుంబాల స్నేహం

ఇటీవల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని మాలినీ దేవికి, మహానంద కుమారికి తాసిల్దార్ కార్యాలయం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఏ విధంగా ఇస్తారని కుటుంబ సభ్యులు నిలదీశారు. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు శేర్లింగంపల్లి తాసిల్దార్ కార్యాలయానికి చేరుకుంది మాగంటి కుటుంబం. ఇక మాగంటి సునీత తరపున ఆయన చిన్న కూతురు దిశిర, లీగల్ అడ్వైజర్ లలిత రెడ్డి హాజరయ్యారు. దీనిపై పరిణామం ఏ మలుపు తిరగబోతుందా అనే ఆసక్తి మొదలైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్