Sunday, March 22, 2026 06:24 AM
Sunday, March 22, 2026 06:24 AM

టెస్ట్ క్రికెట్ లో లోయేస్ట్ టార్గెట్స్ ఇవే

భారత్ తో జరిగిన రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో అనేక రికార్డులు కూడా నమోదు అయ్యాయి. భారత యువ ఆటగాడు, తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా పలు రికార్డులను నమోదు చేసాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా మరో రికార్డ్ కూడా నమోదు అయింది. భారత్ అత్యంత తక్కువ టార్గెట్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 337 పరుగులు చేసింది.

Also Read : కృష్ణయ్య కు రాజ్యసభ అభ్యర్ధిత్వం వెనుక బిజెపి భారీ వ్యూహం

ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు 19 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది భారత్. వాస్తవానికి ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలయ్యే అవకాశం ఉందని అంచనా వేసారు. కాని యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి దెబ్బకు ఆస్ట్రేలియా నుంచి ఇన్నింగ్స్ ఓటమిని భారత్ తప్పించుకుంది. దీనితో 19 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ ముందు ఉంచింది. గతంలో కూడా ఇలాంటి అత్యల్ప టార్గెట్లను పలు జట్లు నమోదు చేసాయి. 2024 లో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా ముందు 36 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ మ్యాచ్ లో ఆసిస్ విజయం సాధించింది.

Also Read : మా నాన్న.. మా నాన్న కాదు.. మనోజ్ సంచలన ప్రెస్ మీట్

ఇక 2021 లో యాషెస్ సీరీస్ లో భాగంగా ఆసిస్ ముందు ఇంగ్లాండ్ 20 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత అదే ఆస్ట్రేలియా జట్టుకు భారత్ 19 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఇక వెస్టిండీస్ ముందు 2022 లో బంగ్లాదేశ్ 12 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 2020 లో ఇండియా… న్యూజిలాండ్ జట్టు ముందు 9 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పుడు మరోసారి భారత్ 19 పరుగుల టార్గెట్ తో అత్యల్ప టార్గెట్ నమోదు చేసింది. ఇక భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ఈ నెల 14 నుంచి మొదలు కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్