Friday, February 20, 2026 10:24 PM
Friday, February 20, 2026 10:24 PM

10 కోట్లు ఇవ్వకపోతే లేపెస్తాం.. స్టార్ హీరోకి బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్..!

ఉత్తరాదిలో సంచలనాలు సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ లను టార్గెట్ చేసింది. తాజాగా ఈ గ్యాంగ్ లో కీలక నిందితుడు హ్యారీ బాక్సర్ శుక్రవారం ఉదయం బాలీవుడ్ స్టార్ హీరో.. రణ్‌వీర్ సింగ్ నుంచి రూ.10 కోట్లు వసూలు చేసేందుకు ప్రయత్నం చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. యుఎస్ ఫోన్ నంబర్ నుండి రణవీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్ కు బెదిరిస్తున్న వాయిస్ నోట్ ఒకటి వచ్చింది. అందులో ఏకంగా పది కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు గుర్తించారు.

Also Read : చెప్పిన లెక్కలన్నీ సభలో అడగొచ్చు కదా..!

ఈ నంబర్ గురించి మరింత సమాచారం కోసం ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అమెరికా అధికారులను సంప్రదించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ నెల మొదట్లో స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వెలుపల కాల్పులు జరిగిన తర్వాత.. రణవీర్ సింగ్ ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. అయితే ఈ వార్నింగ్ మెసేజ్ పై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా, గురువారం ముంబై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్ శెట్టి ఇంటి వెలుపల కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసారు.

Also Read : పిఠాపురంలో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న పవన్..!

వీరికి బిష్ణోయ్ గ్యాంగ్ అడ్వాన్సు ఇచ్చి కాల్పులు జరిపించింది అని గుర్తించారు. బిష్ణోయ్ గ్యాంగ్ లో కీలకంగా భావిస్తున్న.. శుభం లోంకర్ కూడా ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. 2024 అక్టోబర్‌ లో ఎన్సీపీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య, సల్మాన్ ఖాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులకు పాల్పడినందుకు లోంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌ లోని అత్యంత భద్రత కలిగిన జైలులో ఉన్న బిష్ణోయ్.. అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆఫ్ ది రికార్డు...

ఆఫ్ ది రికార్డు అంటూ మీడియాలో...

ఆ విషయంలో టార్గెట్...

మంత్రి నారా లోకేష్ శ్రీలంక పర్యటనపై...

పరారీలో వైసీపీ ఎమ్మెల్సీ..!

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో...

బొత్సకు లోకేష్ అదిరిపోయే...

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లడ్డూ రాజకీయం...

బ్రేకింగ్: అనంతబాబు కేసులో...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సంచలనం...

సోషల్ మీడియాలో జగన్...

అన్నొస్తున్నాడు.. అందరికీ మంచి జరుగుతుంది.. అనేది...

పోల్స్