Thursday, February 5, 2026 01:45 AM
Thursday, February 5, 2026 01:45 AM

లిక్కర్ స్కాం లో కొత్త పేరు.. అరెస్ట్ చేస్తారా..?

ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యంతో పాటుగా, లిక్కర్ స్కాం వ్యవహారాలు రోజురోజుకీ సంచలనం అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చుట్టూ తిరుగుతున్న ఈ కేసులు ఎవరి అరెస్టుకు కారణం అవుతాయా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. కల్తీ మద్యానికి సంబంధించి తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు కాగా.. త్వరలోనే మరి కొంతమంది కీలక వ్యక్తులు కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే సమయంలో లిక్కర్ కుంభకోణం కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇందులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా పలువురు రిమాండ్ లో ఉన్నారు.

Also Read : ఆ విషయంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు..!

ఇక తాజాగా ఈ వ్యవహారంలో ఓ కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. మద్యం వ్యాపారులు కూడా ఇందులో కీలకపాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో మనీలాండరింగ్ జరిగినట్లు తేల్చారు. డొల్ల కంపెనీలను సృష్టించి నిధులను మళ్లించారని తేల్చారు. ముంబై వ్యాపారి అనిల్ చౌక్రా ఇందులో సహాయం చేసినట్లు గుర్తించింది సిట్. అనిల్ ను ఇప్పటికే రెండు కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక లిక్కర్ కుంభకోణంలో అనిల్ అత్యంత కీలకపాత్ర పోషించాడని.. అక్రమంగా వచ్చిన నిధులను మళ్ళించడంలో ఆయన పాత్ర కీలకంగా మారిందని వెల్లడైంది.

Also Read : కల్తీ లిక్కర్ కేసులో.. కొత్త పేరు.. తాడేపల్లి ప్యాలెస్ కు లింకులు..!

ఆయన చెప్పిన వ్యక్తులకు మద్యం లో వచ్చిన డబ్బులను అందించినట్లు గుర్తించారు. ఇప్పటికే ముంబై వెళ్లి అతని పోలీసులు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. ఈ కేసులో 49వ నిందితుడుగా అతనిని అధికారులు చేర్చారు. రాత్రి సిఐడి కోర్టులో ఈ మేరకు మేము కూడా దాఖలు చేశారు సిట్ అధికారులు. డల్ల కంపెనీలు గుర్తింపుతో పాటుగా సాంకేతిక ఆధారాలు కూడా సేకరించారు. ఇక అనిల్ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో పోలీసులు అత్యున్నత స్థాయి నిఘా పెట్టినట్లు సమాచారం. త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్