“నేను బ్రతికి ఉండగా… గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగురుద్ది… నా సంగతి, జగన్ మోహన్ రెడ్డి గారి సంగతి తెలిసిన వాడు ఎవడు పోటీ చేస్తాడు గుడివాడలో… కౌంటింగ్ రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఫ్లైట్ కోసం రెడీగా ఉంటారు… ఇక్కడ వెనక తిరిగిన వాళ్ళు అనాధ పిల్లల్లాగా నీ అమ్మ… వాళ్ళనేం చేయను గాని” గుడివాడలో కొడాలి నానీ మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. కానీ ఇప్పుడు అసలు ఆయన మీడియా ముందు కనపడే సాహసం కూడా చేయడం లేదు.
Also Read: వారిని తాట తీయండి.. బాబు సంచలన ఆదేశాలు
ఎప్పుడైనా జగన్ పిలిస్తే అలా తాడేపల్లి వరకు వెళ్లి… ఎలాగో వెళ్లాం కాబట్టి నాలుగు ముక్కలు మాట్లాడితే అన్న కళ్ళు చల్లబడతాయి అనుకుని మాట్లాడి వచ్చేయడం మినహా… కొడాలి నానీ అసలు మీడియా ముందుకు రావడం లేదు. 2014 నుంచి 19 వరకు చాలా ధైర్యంగా మాట్లాడిన నానీ ఇప్పుడు ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఎన్నికల ప్రచారం సందర్భంగా కొడాలి నానీ చెప్పారు. ఇప్పుడు జగన్ కు కూడా అదే విషయాన్ని చెప్పి ఉంటారు అంటున్నాయి రాజకీయ వర్గాలు.

గుడివాడలో ప్రత్యామ్నాయం చూసుకోవాలని తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఆరోగ్యం కూడా సహకరించడం లేదని చెప్పారని టాక్. దీని పై ఇద్దరి మధ్య వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. అందుకే అసలు గుడివాడలో కూడా కొడాలి నానీ అడుగు పెట్టడం లేదంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. బుడమేరు వరదల ప్రభావం గుడివాడపై కూడా పడింది. ఆ సమయంలో కూడా నానీ వెళ్ళలేదు. నందివాడ మండలం నానీకి అడ్డా… అక్కడ కూడా నానీ వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీనితో జగన్ కు నానీ డెసిషన్ చెప్పేశారని, ఇక ఆయనది అధికార ప్రతినిధి హోదా మాత్రమే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.