Wednesday, February 4, 2026 12:21 PM
Wednesday, February 4, 2026 12:21 PM

పెద్ద ప్లాన్ వేసిన జగన్..!

ఒక కుక్కను చంపాలంటే.. ముందుగా అది పిచ్చిది అని ప్రచారం చేయాలి.. ఆ తర్వాత దానిని ఏం చేసినా పర్లేదు.. ఎవరూ అభ్యంతరం చెప్పరు. పైగా మంచి పని చేశావంటూ పొగడ్తలు బోనస్. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు ఇదే స్ట్రాటర్జీ అమలు చేస్తున్నారు. అధికారంలోకి రాక ముందు అంటే.. ఏ పని చేసినా.. పెద్దగా పట్టించుకోరు. కానీ పదవిలో ఉన్నప్పుడూ.. పదవి పోయిన తర్వాత.. ఏ చిన్న పని చేసినా, ఏ మాట మాట్లాడినా.. ఎక్కడికి వెళ్లినా సరే.. అదో పెద్ద వార్త అవుతుంది. అది పార్టీ గొడవ అయినా సరే.. కుటుంబ తగాదాలు అయినా సరే.. తల్లి, చెల్లితో ఆస్తి వివాదం అయినా సరే.. మరే విషయం అయినా కూడా జగన్ ఏం చేస్తున్నారు.. ఎటు వెళ్తున్నారు.. ఎలా వెళ్తున్నారు అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. అందుకే వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఓ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

Also Read : సైఫ్ ఒక్క ప్యాలెస్ విలువ తెలిస్తే మైండ్ బ్లాక్..!

జగన్ ప్లాన్ చేస్తే.. దానికి తిరుగే లేదంటారు వైసీపీ నేతలు. అది ఏ విషయం అయినా సరే.. జగన్ స్కెచ్ మామూలుగా ఉండదంటారు. అందుకే ఆ పార్టీ నేతలు జగన్ ఏం చెబితే అది రైట్ అంటారు.. అంతే కానీ.. ఎదురు చెబితే మాత్రం.. తర్వాత తీవ్ర పరిణామాలు తప్పవని ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతల్లో కొందరు జగన్ ఎలాంటి వారనే విషయాన్ని చాలా సార్లు వ్యాఖ్యానించారు. ఇక అత్యంత సన్నిహితులు విజయసాయిరెడ్డి వంటి నేతలు వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారంటే.. జగన్ అంటే భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి జగన్ ఒక మాట చెప్పారంటే.. దాని వెనుక ఎంతో పెద్ద ప్లాన్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అక్రమాస్తుల కేసులో ఆరేళ్ల తర్వాత హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో వాయిదాకు జగన్ హాజరయ్యారు. ఈ వ్యక్తిగత హాజరు వల్ల తన పరువు మరింత దిగజారి పోతుందని భయపడ్డారు. మాజీ సీఎం కోర్టుకు హాజరయ్యారనేది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది కూడా. అలాగే ఈ కేసు విచారణ వేగంగా జరిగితే శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే.. ముందు వాయిదాలకు హాజరు కాకుండా ఉండాలి. కానీ ప్రస్తుతం జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యంపై సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులను త్వరగా విచారించాలని ఆదేశించింది. దీంతో జగన్ తప్పనిసరిగా కోర్టుకు హాజరవ్వాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. తప్పని పరిస్థితుల్లో కోర్టుకు హాజరయ్యారు.

Also Read : గ్రాండ్‌గా అఖండ 2 ప్రీ రిలీజ్.. చీఫ్ గెస్ట్‌ ఎవరంటే..?

అయితే ఇదే కొనసాగితే.. వైసీపీ పైన, తనపైన ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భయపడిన జగన్.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ, జన సమీకరణ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బేగంపేట ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి.. తిరిగి బెంగళూరు చేరుకునే వరకు హంగామా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. అందుే బేగంపేట నుంచి నాంపల్లి సీబీఐ కోర్టు వరకు భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో జగన్ అభిమానుల ముసుగులో ర్యాలీ చేశారు. రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారు. ఇక కోర్టు ముందు సీఎం, సీఎం అంటూ హంగామా చేశారు. కోర్టు బయట ఆంక్షలున్నప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగా పోలీసులతో వాదనలకు దిగారు. చివరికి లాఠీచార్జ్ చేసే వరకు పోలీసులను రెచ్చగొట్టారు.

జగన్ కోర్టుకు హాజరవ్వటం ఇదే తొలిసారి కాదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కోర్టు వాయిదాలకు హాజరయ్యారు. 2020లో కూడా మాజీ సీఎం హోదాలో కోర్టులో న్యాయమూర్తి ఎదుట చేతులు కట్టుకున్నారు. నిజానికి అప్పుడు ఒక్కసారి కూడా అభిమానులంటూ ఈ స్థాయిలో రాలేదు.. హంగామా చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు హైదరాబాద్ వెళ్లారు జగన్. పెళ్లిళ్లకు, సమావేశాలకు, వాయిదాలకు కూడా హాజరయ్యారు. కానీ ఒక్కసారి కూడా ఈ స్థాయిలో ఎవరు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. పెద్ద ప్లాన్‌తోనే ఈ స్థాయిలో జన సమీకరణ చేసినట్లు తెలుస్తోంది. తాను వస్తే.. పెద్ద స్థాయిలో అభిమానులు వస్తారని.. తన భద్రతకు కూడా ముప్పు ఉంటుందని కోర్టుకు తెలియజేస్తే.. అప్పుడు వాయిదాలకు రావొద్దు అంటారనేది వైసీపీ అధినేత ప్లాన్. ఇందుకోసం ఏపీ నుంచి భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్ చుట్టూ ఉన్న వాళ్లలో ఏపీకి చెందిన నేతలే ఉన్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని, ఆదిమూలపు సురేశ్, విడదల రజిని సహా వైసీపీ నేతలు వెంకటరెడ్డి, శ్యామల సహా మిగిలిన నేతలంతా అక్కడ హంగామా చేశారు.

Also Read : అంతా నా ఇష్టం అంటున్న జగన్

ఇక జగన్ హైదరాబాద్ పర్యటనలో కూడా రప్పా రప్పా ప్లకార్డులతో రెచ్చిపోయారు వైసీపీ అభిమానులు. 2029లో జగన్ 2.0 ఖాయం.. ప్రతి ఒక్కరికి రప్పా రప్పా అంటూ బ్యానర్లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఇక వైసీపీ అనుకూల మీడియా అయితే.. జగన్ అభిమానం, సునామీ అంటూ పెద్ద ఎత్తున ఎలివేషన్ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. మొత్తానికి హైదరాబాద్‌లో జగన్‌ పర్యటన ఇదే తొలిసారి కాదు. నాంపల్లి సీబీఐ కోర్టులో వాయిదాలకు హాజరవ్వడం ఇదే తొలిసారి కాదు. అయినా సరే.. జగన్‌కు హైదరాబాద్‌లో, తెలంగాణలో ఫాలోయింగ్ ఉందనేలా పెద్ద ఎత్తున ఎలివేషన్ ఇచ్చేందుకు వైసీపీ నేతలు నానా పాట్లు పడ్డారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్