Sunday, March 22, 2026 06:24 AM
Sunday, March 22, 2026 06:24 AM

జగన్ మాస్టర్ ప్లాన్.. మామూలుగా లేదుగా..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పొలిటికల్ సర్కిల్‌లో మాస్టర్ మైండ్ అంటారు. ఇక టీడీపీ నేతలైతే పొలిటికల్ క్రిమినల్ అంటారు. సొంత పార్టీ నేతలైతే.. జగన్ ఆలోచన అందుకోవటం చాలా కష్టమంటారు. అందుకే వైసీపీ నేతలు జగన్ చెప్పినట్లు చేస్తారు తప్ప.. ఎందుకు, ఏమిటీ అని మాత్రం ఆలోచించరు. ఎదురు ప్రశ్నించరు. అలా ప్రశ్నిస్తే.. నేను చెప్పినట్లు చెయ్యండి అన్న చాలు.. అనే జవాబే వస్తుంది. అందుకే ఏ మాత్రం ఎదురు చెప్పకుండా జగన్ చెప్పినట్లు ఫాలో అయిపోతారు. అలాంటి జగన్ జనంలోకి వస్తే.. ఒక ప్రెస్ మీట్ పెడితే.. దాని వెనుక చాలా మతలబు ఉంటుంది. తాజాగా జగన్ పెట్టిన ప్రెస్ మీట్ వెనుక చాలా లోతైన కారణాలున్నాయనేది ఇప్పుడు అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు పోలీస్ సర్కిల్‌లో కూడా హాట్ టాపిక్. నెల రోజుల క్రితం వచ్చిన మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల కోసం అన్నట్లుగా ప్రెస్ మీట్ ‌మొదలు పెట్టిన జగన్.. రెండున్నర గంటల పాటు మాట్లాడారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో ముందే రాసుకువచ్చిన డేటాను చదివి వినిపించారు.

Also Read : జగన్‌కు హిందూ సంఘాల వార్నింగ్..!

జగన్ ప్రెస్ మీట్‌కు కేవలం కొంత మందికే అనుమతి ఉంటుంది. కానీ మాట్లాడిన విషయం గురించి మాత్రం అందరూ చర్చించుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. నిజమే అని నమ్మేలా జగన్ మాటలు ఉంటాయి. రైతులకు మేలు చేసింది తమ ప్రభుత్వమే అని మొదలుపెట్టిన జగన్.. ఆ తర్వాత తన ప్రెస్‌మీట్‌ను కూటమి సర్కార్ వేధింపులు, అక్రమ అరెస్టులు అంటూ మలుపు తిప్పారు. చివరికి అందరి దృష్టిని తిరుమల తిరుపతి దేవస్థానం వైపు మళ్లించారు. ముందు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారనే కేసు గురించి మాట్లాడిన జగన్.. ఆ తర్వాత పరకామణి చోరీ కేసు గురించి ఓ అరగంట పాటు మాట్లాడారు. ఈ రెండు కేసుల వల్ల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బ తిన్నది అంటూ కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. తాము అధికారంలో ఐదేళ్ల కాలం తిరుమల ప్రతిప్ఠ పెంచామని గొప్పగా చెప్పిన జగన్.. ఆ సమయంలో గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయని.. అవన్నీ తమ హయాంలోనే వెలుగులోకి వచ్చాయని కొత్త పాట పాడారు. వాటిని బయటపెడితే తిరుమల పవిత్రత దెబ్బ తింటుందనే భావనతో ఏ ఒక్క తప్పు బయటపెట్టలేదన్నారు.

Also Read : పట్టు వీడని మావోలు.. ఎందుకంత ధైర్యం..?

ఇదే సమయంలో పరకామణి చోరీ కేసును చాలా చిన్న దొంగతనంగా అభివర్ణించిన జగన్.. ఈ కేసులో తిరుపతి కోర్టు న్యాయమూర్తి సుప్రీం కోర్టు న్యాయమూర్తి సలహా తీసుకుంటే తప్పేంటని కూడా వింత వాదనను తెర పైకి తీసుకువచ్చారు. కేవలం 9 డాలర్లు కొట్టేశాడని.. వాటి విలువ 70 వేలు అని చెప్పిన జగన్.. అయినా సరే.. తమ ఏకంగా రూ.14.5 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రాయించామని గొప్పగా చెప్పుకొచ్చారు. అసలు పెద జీయర్ మఠం గుమాస్తా పరకామణి ఇంఛార్జ్‌ స్థానంలో నాలుగేళ్ల పాటు ఎలా ఉన్నాడనే దానికి మాత్రం జగన్ జవాబు చెప్పలేదు. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే హుండీని.. చాలా చిన్న చోరీ అని జగన్ అభివర్ణించారు. అదే సమయంలో సింహాచలం దేవస్థానంలో జరిగిన చోరీ గురించి కూడా ప్రస్తావించారు. ఆ కేసులో ఆలయ ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు.

Also Read : డాలర్ విలువ పెరిగితే.. మనపై ప్రభావం ఎలా పడుతుందో తెలుసా..?

అయితే ఈ ప్రెస్ మీట్ వెనుక అసలు ఉద్దేశ్యం వేరుగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి పరకామణి చోరీ కేసులో విచారణ అంతా హైకోర్టు డైరెక్షన్‌లోనే జరుగుతోంది. తిరుపతికి చెందిన ఓ రిపోర్టర్ వేసిన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఏపీ సీఐడీని విచారణకు ఆదేశించింది. ఈ కేసు వివరాలను డిసెంబర్ 5వ తేదీ నాటికి సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా సీఐడీ చీఫ్ రంగంలోకి దిగారు. నిజానికి ఈ కేసు విచారణలో కూటమి సర్కార్ అస్సలు జోక్యం చేసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలే కక్ష కట్టారని ప్రచారం చేస్తున్నారు. అటు జగన్ మాత్రం.. సరిగ్గా రిపోర్టు హైకోర్టుకు చేరే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టి.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మేలు చేశామని.. తిరుమలలో జరుగుతున్న అక్రమాలకు చంద్రబాబు కారణమని జనాల్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. తుఫాన్ వెళ్లిన నెల రోజుల తర్వాత ప్రెస్ మీట్ వెనుక రైతులపై ప్రేమ కంటే.. సొంత బాబాయ్‌ను రక్షించాలనే తాపత్రయం ఉందని.. అందుకే మీడియా ముందుకు వచ్చారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్