Sunday, March 22, 2026 04:35 AM
Sunday, March 22, 2026 04:35 AM

స్మృతి మందాన పెళ్లి క్యాన్సిల్..?

టీం ఇండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పాలష్ ముచ్చల్ వివాహం రద్దు అయిందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. వాస్తవానికి వీరి వివాహం నవంబర్ 23న సాంగ్లిలో జరగనుంది. కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేసి, వేడుకలను ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆదివారం ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురికావడంతో వేడుకలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఆ కాసేపటికి ఆయన గుండెపోటుతో ఆస్పత్రి బారిలో పడ్డారనే వార్త వచ్చింది.

Also Read : ఆ మూడు సంస్థలదే పెత్తనం..!

ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నానికి అనారోగ్యం కారణంగా ముచ్చల్ కూడా ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీనితో అతనిని ఆస్పత్రికి తరలించారు. అయితే వివాహం వాయిదా పడిన తర్వాత స్మృతి మందాన సోషల్ మీడియాలో కాస్త ఆసక్తికర విషయాలు కనిపించాయి. స్మృతి మందాన తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంటు నుంచి వివాహానికి సంబంధించిన అన్ని పోస్ట్‌ లను డిలీట్ చేసింది. ఇది చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ టైములో ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా మాట్లాడారు.

Also Read : నూతన కార్మిక చట్టాల్లో మహిళల ప్రయోజనాలు తెలుసా..?

ఆమె తండ్రి పూర్తిగా కోలుకున్న తర్వాతే వివాహం జరుగుతుందన్నారు. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియో లను మరో క్రికెటర్ జేమిమా కూడా డిలీట్ చేసింది. అయితే, ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో స్మృతికి పలాష్ ముచ్చల్ చేసిన ప్రపోజల్ కు సంబంధించిన ఫోటో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంది. నవంబర్ 21 న ఆ ఫోటోని అతను షేర్ చేసాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బ్యాక్ గ్రౌండ్ లో ఏదో జరుగుతోందని, పెళ్లి జరగకపోవచ్చేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ వార్తలను మాత్రం ఇరు కుటుంబాలు ఖండించలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్