ఆస్ట్రేలియా పర్యటన అంటే భారత్ లో ఐపీఎల్ మ్యాచ్ లు ఆడినంత సులువుగా ఉండదు. పవర్ ప్లేలో 100 పరుగులు చేసిన 150 పరుగులు చేసినా ఆస్ట్రేలియా మైదానాలపై నువ్వు ఎన్ని బంతులు తట్టుకుని నిలబడతావు… ఎన్ని వికెట్లు తీస్తావ్ అనేదానిపైనే జట్టు విజయ అవకాశాలు అలాగే ఆటగాడి ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ లో నాలుగో ఓవర్ల కోట పూర్తి చేసి పది పరుగులు ఇచ్చినా… అది పెద్ద గొప్ప విషయం కాదు. ఆస్ట్రేలియా మైదానాల్లో 10 ఓవర్లు బంతులు వేసి రెండు వికెట్లు తీసిన గొప్పే.
Also Read : తన సస్పెన్షన్ వార్తల పై జానీ మాస్టర్ క్లారిటీ
బంతిని గింగరాలు తిప్పడానికి స్వింగ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని బౌలర్లు గ్రహించి ఆస్ట్రేలియా మైదానాలపై బౌలింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే బ్యాట్స్మెన్ బుల్లెట్ల మాదిరి దూసుకొచ్చే బంతులను ఎంత వేగంగా స్పందించి ఎదుర్కొంటారు అనేదానిపైనే వారి ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియా మైదానాలపై రాణిస్తే ఖచ్చితంగా కెరీర్ లో తిరుగు ఉండదు. అలా రాణించే రిషబ్ పంత్, శుభమన్ గిల్ వంటి వారు ప్రస్తుతం టీం లో కీలకంగా ఉన్నారు. విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియా మైదానాల్లో మంచి ప్రదర్శనలు చేశాడు.
ఆ తర్వాతే అతనికి మంచి ఇమేజ్ వచ్చింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఏ రేంజ్ లో స్లెడ్జింగ్ చేసినా వాటికి సమాధానం ఇస్తూనే ఆటపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేగాని ప్రత్యేకంగా సెలెడ్జింగ్ పై దృష్టి సారిస్తే ఆస్ట్రేలియాకు ఏం చేయాలనే దానిపై ఒక క్లారిటీ ఉంటుంది. ఆటగాళ్ల మానసిక పరిస్థితి దెబ్బకొట్టే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాను అదే విధంగా ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి టెస్ట్ లో ఘనవిజయం సాధించిన రెండో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని ఎదుర్కొంది భారత్.
Also Read : ఆయనకే ఎందుకు అవకాశం సార్…?
కాబట్టి కీలక ఆటగాళ్లు స్లెడ్జింగ్ ను పక్కనపెట్టి ఆస్ట్రేలియాను ఎదురుకోవడం ఎలా అనే దృష్టి పెట్టాలి. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అలాగే మహమ్మద్ సిరాజ్ స్లెడ్జింగ్ ను కాస్త పక్కన పెడితే మంచిది. అలాగే యువ ఆటగాడు హర్షిత్ రానా కూడా బౌలింగ్ పై కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకోకపోతే మాత్రం తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందరో యువ ఆటగాళ్లు జట్టులో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని కెరీర్ పై ఫోకస్ పెట్టాలని ఆస్ట్రేలియాను ఎదుర్కోవటం పై దృష్టి పెడితే మంచిది అంటూ పలువురు సూచిస్తున్నారు.

