Sunday, March 22, 2026 05:13 AM
Sunday, March 22, 2026 05:13 AM

క్యూబ్ నెట్ వర్క్ ను దెబ్బకొట్టిన ఐబొమ్మ రవి..?

టాలీవుడ్ ను ఏళ్ళ తరబడి కలవరపెట్టిన ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతోంది. సినిమాలను పెద్ద ఎత్తున పైరసీ చేయడం, వాటిని అప్లోడ్ చేయడం ద్వారా కోట్లు సంపాదించాడు రవి. కరేబియన్ దీవుల పౌరసత్వం తీసుకున్న రవి.. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతని విచారణలో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. అతనికి సహకరించిన వారిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. అలాగే బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కూడా పోలీసులు కీలక అడుగులు వేస్తున్నారు.

Also Read : కూటమిలో ఆ ఇద్దరి వల్లే చిచ్చు..!

తాజాగా ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. విచారణలో మరిన్ని విషయాలు గుర్తించారు. ప్రహ్లాద్‌ కుమార్‌, ప్రసాద్‌ పేరుతో రెండు కంపెనీలు రిజిస్టర్‌ చేసిన రవి.. వాటి ద్వారానే లావాదేవీలు జరిపాడు. ఈ మేరకు అతనిని పోలీసులు ప్రశ్నించారు. అయినప్పటికీ రవి సమాచారం ఇవ్వలేదు. ప్రహ్లాద్‌ పేరిట పాన్‌కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులను రవి తీసుకున్నాడు. అలాగే హెచ్ డీ సినిమా పైరసీపై రవి నోరు విప్పాడు. టెలిగ్రామ్‌ ఛానల్‌ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్టు ఒప్పుకున్నాడు.

Also Read : బ్రేకింగ్: టి20 కెప్టెన్ మార్పు..?

క్యూబ్‌ నెట్‌వర్క్‌ను సైతం హ్యాక్‌ చేసిన రవి.. ఆ సినిమాలను రికార్డ్ చేసాడు. శాటిలైట్‌ లింక్‌ హ్యాక్‌ చేసి హెచ్‌డీ ఫార్మాట్‌లో సినిమాలు రికార్డ్‌ చేసాడు. ఈ సినిమాలను టెలిగ్రామ్‌ లో రవి విక్రయించాడు. పైరసీకి హెచ్‌డీ హబ్‌ పేరిట టెలిగ్రామ్‌ ఛానల్‌ ఒకటి క్రియేట్ చేసాడు. పైరసీ లింక్‌ అప్‌లోడ్‌ చేసి 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. సినిమాలు ఫ్లాప్ అయిన నిర్మాతలు కొందరు రవికి సినిమాలు అమ్మినట్టు కూడా అనుమానిస్తున్నారు. దీనితో ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్