దేశంలోనే అతి పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్‌లో లోసుగులను పన్ను ఎగవేత కోసం వినియోగించుకున్నట్లు అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన మూడు ప్రముఖ బిర్యానీ తయారీ హోటల్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రముఖ బిర్యానీ తయారీ హోటల్స్.. హైదరాబాద్ సహా వివిధ పలు అవుట్‌లెట్స్ నిర్వహిస్తున్న 3 హోటల్ గ్రూపులు కూడా పన్ను ఎగవేత కేసులో దర్యాప్తు కిందకు రావడంతో, భారతదేశం అంతా రెస్టారెంట్ బిల్లింగ్ వ్యవస్థలను తారుమారు చేయడంతో పెద్ద కుంభకోణాన్ని అధికారులు వెలికితీశారు.
Also Read : అభిషేక్ వీక్నెస్ బయటపెట్టిన పాక్ మాజీ ప్లేయర్..!
ఆహార పరిశ్రమ అంతటా దాదాపు రూ.70 వేల కోట్ల వరకు అప్రకటిత ఆదాయం ఈ కుంభకోణంలో ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ నగర విభాగం మొదట అనుమానిత ఆర్థిక అవకతవకలు, లెక్కించని ఆదాయంపైన, బిర్యానీ చైన్ అవుట్‌లెట్ సంస్థలపైన దర్యాప్తు ప్రారంభించింది. దీని ఫలితంగా గత ఏడాది నవంబర్‌లో దాదాపు 30 చోట్ల దాడులు జరిగాయి. వాటిలో రెస్టారెంట్ అవుట్‌లెట్‌లు, మూడు బ్రాండ్‌లకు సంబంధించిన సీనియర్ మేనేజ్‌మెంట్ ఇళ్లు కూడా ఉన్నాయి. ఈ దాడుల ఫలితంగా బహుళ ఖాతాల ద్వారా జరిగిన #UPI లావాదేవీలతో సహా పెద్ద మొత్తంలో డిజిటల్ డేటా రికవరీ చేసినట్లు వర్గాలు తెలిపాయి. ఈ డేటా విశ్లేషణ దర్యాప్తుదారుల పన్ను ఎగవేతకు వినియోగించిన విస్తృత నెట్‌వర్క్ వైపు చూపింది.
దేశవ్యాప్తంగా 1.7 లక్షలకు పైగా రెస్టారెంట్ ఐడీలు ఉపయోగించే పాయింట్-ఆఫ్-సేల్.. #POS వ్యవస్థ నుండి దాదాపు 60 టెరాబైట్ల బిల్లింగ్ డేటాను అధికారులు పరిశీలించారు. ఇది దర్యాప్తు పరిధిని పాన్ ఇండియా స్థాయికి గణనీయంగా విస్తరించింది. హోటల్ వ్యవస్థ ఉపయోగించే బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో “బల్క్ డిలీట్ ఫీచర్” ఉందని, ఇది ఒకేసారి 30 రోజుల వరకు అమ్మకాల రికార్డులను తొలగించగలదని, తక్కువ రికార్డును మాత్రమే మిగిల్చుతుందని దర్యాప్తులో తేలింది. వ్యక్తిగత బిల్లులను తొలగించడం లేదా బిల్లులను రూపొందించిన తర్వాత వాటిని సవరించడం వంటి ఇతర విధులు కూడా దుర్వినియోగం చేయబడ్డాయని ఆరోపణలు ఉన్నాయి.
Also Read : సుప్రీం కోర్ట్ ను లెక్క చేయని ట్రంప్..!
రెస్టారెంట్లు టర్నోవర్‌ను తక్కువగా నివేదించడానికి, పన్ను చెల్లింపులను తగ్గించడానికి వీలుగా అమ్మకాల లెక్కలను క్రమపద్ధతిలో అణిచివేయడానికి ఈ ఫీచర్‌లను ఉపయోగించారని పన్ను అధికారులు పేర్కొన్నారు. విశ్లేషణ సమయంలో పెద్ద ఎత్తున తొలగింపు, బిల్లింగ్ రికార్డుల మార్పు సంకేతాలను గుర్తించారు.
2019-20 నుండి డిలీచ్ చేసిన అమ్మకాల విలువ కనీసం రూ.70 వేల కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఈ మొత్తం రూ.5 వేల కోట్లకు పైగా వాటా కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. వేలాది పాన్ నంబర్లలో అక్రమాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొన్నింటిలో రూ.కోటికి పైగా అప్రకటిత అమ్మకాలు జరిగినట్లు చూపించాయని ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఈ కుంభకోణంపై ఆదాయపు పన్ను శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అధికారులు మాత్రం డిలీట్ అయిన బిల్లింగ్ డేటా రికవరీని కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పన్ను డిమాండ్లు, జరిమానాలు, సాధ్యమైన ప్రాసిక్యూషన్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

