Sunday, March 22, 2026 01:43 AM
Sunday, March 22, 2026 01:43 AM

పరకామణి కేసు: హైకోర్ట్ సంచలన ఆదేశాలు

పరకామణి కేసు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా అనే ఆసక్తి గత నాలుగు రోజుల నుంచి పెరుగుతోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న సతీష్ కుమార్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అతని వద్ద కీలక సమాచారం ఉండటంతో సిఐడీ అధికారులు అతన్ని విచారిస్తూ రావడం, మరోసారి విచారణకు పిలవడం వంటివి జరిగాయి. దీనితోనే అతని హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలు బలపడ్డాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో పోలీసులు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు.

Also Read : గోవా టూరిజం పడిపోయిందా..? లెక్కలు ఏం చెప్తున్నాయి..?

ఇటీవల సిఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, సీన్ కూడా రీ కనస్ట్రక్షన్ చేయించారు. ఇక అక్కడి నుంచి సతీష్ కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం తో పాటుగా పలు వైద్య పరీక్షలను కూడా నిర్వహించారు. ఈ నేపధ్యంలో తాజాగా హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సతీష్‌కుమార్‌ మృతితో.. ఈ కేసులో నిందితుడు రవికుమార్‌, ఇతర సాక్షులకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వారి వద్ద ఉన్న సాక్ష్యాలను కూడా భద్రపరచాలని ఆదేశించింది.

Also Read : భారత్ లో హమాస్ తరహా దాడులకు ప్లాన్..?

సీఐడీ అధికారులు కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని సీఐడీ డీజీ మెమో దాఖలు చేయగా.. అందుకు అంగీకరించిన న్యాయస్థానం, తదుపరి విచారణ డిసెంబర్‌ 2కి వాయిదా వేసింది. సతీష్‌ కుమార్‌ అసహజ మరణ వార్తతో షాక్‌ అయ్యాం అంటూ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఇక సతీష్ మరణంపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీలో.. వైసీపీ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. అసలు కేసు గురించి పోలీసుల ప్రకటనలకు ముందే ఆత్మహత్యగా ఎలా చెప్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్