Monday, March 23, 2026 05:14 PM
Monday, March 23, 2026 05:14 PM

కుప్పకూలిన బంగారం ధరలు.. కొనేవారికి పండగే..!

గత రెండు మూడు నెలల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, డాలర్ బలపడటంతో దేశీయంగా పసిడి ధరలు దిగివస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరల పతనం కొనసాగుతుండగా.. నేడు అది భారీగా ఉండటం గమనార్హం. ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయని నిపుణులు అంటున్నారు.

Also Read : దుమారం రేపుతున్న గరికపాటి వ్యాఖ్యలు..!

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నేటి ధరలు చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం చూస్తే, నేటి ధర రూ.1,28,350 ఉండగా.. నిన్నటి కంటే దాదాపు రూ.5,450 భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,020 ఉండగా నిన్నటి కంటే సుమారు రూ.5,950 మేర పతనమైంది. కిలో వెండి ధర నేడు రూ.2,49,900 వద్ద కొనసాగుతోంది, ఇది నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గింది. బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు, ఫలితంగా మార్కెట్‌లో ధరలు దిగివచ్చాయి.

Also Read : ఏపీలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ కలకలం..!

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌ లో బంగారం 5% కంటే ఎక్కువ పతనం కావడం కూడా రిటైల్ ధరలపై ప్రభావం చూపింది. వరుసగా నాలుగో వారం కూడా అంతర్జాతీయంగా బంగారం ధరలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పసిడి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీల వల్ల తుది ధరలు జ్యువెలరీ షాపులను బట్టి మారుతుంటాయి. ఏది ఏమైనా పెళ్ళిళ్ళ సీజన్ లో ఇది మంచి పరిణామం గానే చెప్పుకోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శ్రీశైలం డ్యామ్ పునాదులు...

రెండు తెలుగు రాష్ట్రాల సాగు, జల...

కావలి టీడీపీలో గ్రూపు...

ఓ వైపు టీడీపీ అధిష్టానం, సిఎం...

జగన్‌తో ఒంటరి పోరాటం...

ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఎమ్మెల్యే...

ఏపీలో ఏనుగు దంతాల...

వన్య ప్రాణుల భద్రత విషయంలో ప్రభుత్వాలు...

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

పోల్స్