Tuesday, October 21, 2025 11:35 PM
Tuesday, October 21, 2025 11:35 PM
roots

ఇదేం చెత్త టీం..? పాక్ క్రికెట్ పై ఫ్యాన్స్ ఫైర్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే మన దేశంలో సంగతి పక్కన పెడితే, పాకిస్తాన్ లో మాత్రం ఈ పోటీ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఒకరకంగా ఆ దేశానికి పరువుతో సంబంధించిన విషయం. ఓడిపోతే పరువు పోయినట్టు భావించే అక్కడి ఫ్యాన్స్.. తేడా వస్తే సొంత జట్టుపైనే తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆసియా కప్ లో వరుసగా రెండు సార్లు ఓడిపోయింది పాకిస్తాన్. దీనితో పాక్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్నారు.

Also Read : ప్రభాస్ పై బాలీవుడ్ మాఫియా దాడి..!

మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు.. వికెట్లు చేతిలో ఉంచుకుని కూడా ఆత్మరక్షణ ధోరణిలో ఆడింది. కనీసం 200 చేయాల్సిన మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యంతో చతికిలపడింది. బూమ్రాపై ఎదురు దాడి చేసినా.. మిగిలిన బౌలర్ల విషయంలో దూకుడుగా ఆడలేకపోయారు. శివం దుబే బౌలింగ్ లో పరుగులు చేయలేక ఇబ్బంది పడింది పాకిస్తాన్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. కీలక, సీనియర్ బౌలర్ లు అందరూ ఫెయిల్ అయ్యారు. 9 ఓవర్లకే భారత్ వంద పరుగుల మార్క్.. వికెట్ కోల్పోకుండా చేరుకుంది.

Also Read : లిక్కర్ స్కామ్ ని మించిన మరో కుంభకోణం బయటపెట్టిన ఏబివి

అభిషేక్ శర్మ దూకుడుపై పాకిస్తాన్ తక్కువ అంచనా వేసింది. ఇక గిల్ కూడా అదే దూకుడు ప్రదర్శించాడు. దీనితో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు. షాహిన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. వారి బౌలింగ్ లో అభిషేక్ శర్మ ఓ ఆట ఆడుకున్నాడు. తొలి బంతికే సిక్స్ కొట్టాడు అభిషేక్. ఇక ఫీల్డింగ్ కూడా పాకిస్తాన్ అంచనాలకు తగ్గట్టే చేసింది. పాకిస్తాన్ పేలవ ఫీల్డింగ్ ఈ మ్యాచ్ లో కూడా కొనసాగింది. దీనితో జట్టులో మార్పులు చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. హారిస్ రవూఫ్ పేరుకే సీనియర్ బౌలర్ అయినా సరే అతని బౌలింగ్ లో పస లేదని, అఫ్రిది బౌలింగ్ టి20 లకు సూట్ అవ్వదని, ఇక బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని, భారత్ తో పోరాడే ముందు జట్టును సమర్ధవంతంగా ఎంపిక చేసుకోవాలని ఫ్యాన్స్ ఆ దేశ క్రికెట్ బోర్డ్ పై విమర్శలు చేస్తున్నారు. యూఏఈ కనీస పోరాటం చేసిందని, పాకిస్తాన్ కనీసం ఆ పోరాటం కూడా చేయలేదని మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్