Sunday, February 15, 2026 02:47 PM
Sunday, February 15, 2026 02:47 PM

ఈరోజు (10-12-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం 10-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 10-12-2025

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

వృషభం 10-12-2025

చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.

—————————————

మిధునం 10-12-2025

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మాతృ వర్గ బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

కర్కాటకం 10-12-2025

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

—————————————

సింహం 10-12-2025

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

—————————————

కన్య 10-12-2025

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు. మానసికంగా ప్రశాంతం ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

—————————————

తుల 10-12-2025

సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతవరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

—————————————

వృశ్చికం 10-12-2025

ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

ధనస్సు 10-12-2025

బంధు, మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధనవ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి.

—————————————

మకరం 10-12-2025

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

—————————————

కుంభం 10-12-2025

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 

—————————————

మీనం 10-12-2025

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శించుకుంటారు.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పవన్ ను ఎందుకు...

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం...

ఏపీ బడ్జెట్ విశేషాలు.....

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక...

అధినేతపై గుర్రుగా క్యాడర్.....

పార్టీ అధ్యక్షుడు ఎక్కడా..? అసలు ఆయన...

లోకేష్ కు జనసైనికులు...

నేటి రాజకీయాల్లో మాటకు మాట సమాధానం...

అంబటి దెబ్బ.. ఆ...

వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. మాజీ...

విజయవాడకు మెగా ప్రాజెక్టులు..!

కూటమి సర్కార్ ‌అధికారంలోకి వచ్చిన తర్వాత...

పోల్స్