Thursday, February 5, 2026 12:56 AM
Thursday, February 5, 2026 12:56 AM

ఈరోజు (05-11-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 05-11-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 05-11-2025

నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

—————————————

వృషభం 05-11-2025

చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

—————————————

మిధునం 05-11-2025

దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్య పరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ఉద్యోగపరంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.

—————————————

కర్కాటకం 05-11-2025

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ది కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

—————————————

సింహం 05-11-2025

ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

—————————————

కన్య 05-11-2025

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు వలన లాభం పొందుతారు. ధనదాయం బాగుంటుంది. అనారోగ్య సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

—————————————

తుల 05-11-2025

వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల నుండి బయటపడతారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

—————————————

వృశ్చికం 05-11-2025

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

—————————————

ధనస్సు 05-11-2025

వ్యాపార పరంగా ఇబ్బందులు తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.

—————————————

మకరం 05-11-2025

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడగలుగుతారు.

—————————————

కుంభం 05-11-2025

సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది.

—————————————

మీనం 05-11-2025

ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్