Friday, April 10, 2026 03:57 PM
Friday, April 10, 2026 03:57 PM

ప్రభాస్ ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అనగానే ఇండియా వైడ్ గా క్రేజ్ ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రభాస్ సినిమాలకు క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్.. నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ ఫౌజీ షూటింగ్ ఇప్పుడు మరింత వేగవంతమైంది. సీతారామం వంటి క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని అద్భుతమైన ఎమోషనల్ వార్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, సినిమా అవుట్‌ పుట్‌ ను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు దర్శకుడు ఇప్పుడు ఏకకాలంలో రెండు షూటింగ్ యూనిట్లను రంగంలోకి దించాడు.

Also Read : ఢిల్లీ వెలుపల మరో భారీ పవర్ సెంటర్ గా ‘అమరావతి’

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలకు షూటింగ్ సమయం ఎక్కువగా పడుతుంది. అయితే, ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకు ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో హను రాఘవపూడి ఈ డ్యూయల్ యూనిట్ ప్లాన్‌ ను అమలు చేస్తున్నారు. ఒక యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంటే, మరో యూనిట్ కీలకమైన టాకీ పార్ట్, ఇతర సన్నివేశాలను పూర్తి చేస్తోందని సమాచారం. దీనివల్ల షూటింగ్ సమయం ఆదా అవ్వడమే కాకుండా, క్వాలిటీ విషయంలో కూడా రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read : ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!

ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌ లో కనిపించబోతున్నాడు. బ్రిటీష్ ఇండియా కాలం నాటి ఒక పవర్‌ ఫుల్ ఆర్మీ ఆఫీసర్‌ గా నటిస్తున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో ప్రభాస్ క్లాస్ అండ్ రగ్గడ్ లుక్ ఫ్యాన్స్‌ కు పూనకాలు తెప్పించింది. బ్రిటీష్ సేనలతో పోరాడే వీరుడిగా ప్రభాస్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ స్పీడు చూస్తుంటే ప్రభాస్ ఆగస్టు నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా అత్యంత భారీ బడ్జెట్‌ తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేబినెట్ సమాచారం లీక్.....

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన...

ఉద్యోగులకు ఇచ్చిన హామీ...

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల...

ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!

తెలుగుదేశం పార్టీలో సింగిల్ టైం ఎమ్మెల్యేలకు...

వైఎస్ఆర్ మరణానికి జగనే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం...

ఢిల్లీ వెలుపల మరో...

అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి మరో...

బ్రేకింగ్: మహానాడు పై...

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే...

పోల్స్