Wednesday, February 4, 2026 06:39 AM
Wednesday, February 4, 2026 06:39 AM

‘మన శంకర వరప్రసాద్’ హిట్టా.. ఫట్టా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత ఐదు దశాబ్దాలుగా ఎనలేని సేవలందిస్తూ మెగాస్టార్‌గా అజరామరంగా వెలుగొందుతున్న నటుడు చిరంజీవి. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలను క్రియేట్ చేస్తుంది. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, అధికారిక విడుదలకు ముందే నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ నిర్వహించారు. మరి ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు విశ్లేషిద్దాం.

కథ

శంకర వరప్రసాద్ (చిరంజీవి) మరియు శశిరేఖ (నయనతార) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే శశిరేఖ తండ్రి, ప్రముఖ బిజినెస్ మ్యాన్ జీవీఆర్ (సచిన్ కేడ్కర్)కి ఈ వివాహం ఇష్టం ఉండదు. వారి మధ్య దూరం పెంచేందుకు పన్నాగాలు పన్నుతూ చివరకు వారిద్దరూ విడాకులు తీసుకునేలా చేస్తాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంటారు. భార్య నుంచి విడిపోయిన అనంతరం శంకర వరప్రసాద్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఒక కీలక సందర్భంలో సెంట్రల్ మినిస్టర్‌ను కాపాడిన శంకర వరప్రసాద్ గతాన్ని తెలుసుకున్న ఆ మినిస్టర్, అతని కుటుంబాన్ని మళ్లీ కలిపే ప్రయత్నం చేస్తాడు.

Also Read : శ్రీవారితో ఆటలు.. వైసీపీ నేతపై గురి..?

భార్యను చేరుకోవాలంటే ముందు పిల్లల మనసు గెలుచుకోవాలని భావించిన శంకర వరప్రసాద్, వారు చదువుతున్న స్కూల్‌లో పీఈటీ సార్‌గా చేరతాడు. అక్కడ పిల్లలతో బంధం పెంచుకుంటున్న సమయంలోనే జీవీఆర్‌పై దాడి జరుగుతుంది. సెక్యూరిటీ అవసరమవడంతో శంకర వరప్రసాద్ జీవీఆర్ ఇంట్లోకి అడుగుపెడతాడు. ఇక జీవీఆర్‌పై దాడి చేసినవారు ఎవరు? శంకర వరప్రసాద్ తన భార్య మనసు గెలుచుకొని మళ్లీ కుటుంబంతో కలిసాడా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

అనిల్ రావిపూడి సినిమా అంటే కథ కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. ‘మన శంకర వరప్రసాద్’ కూడా ఈ ట్రాక్‌కే పరిమితమైంది. స్టోరీ పరంగా పెద్దగా కొత్తదనం లేకుండా రొటీన్ కథతోనే సినిమా ముందుకు సాగుతుంది. చిరంజీవి మేనరిజమ్స్‌తో మ్యాజిక్ చేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఎంగేజింగ్‌గా సాగిన కథనం, సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి కొంత తడబడినట్టు అనిపిస్తుంది. కామెడీ డోస్ తగ్గిపోవడం, కథ మొత్తం ఒకే లొకేషన్‌లో సాగడం వల్ల కొన్ని చోట్ల బోర్ కలుగుతుంది. చిరంజీవి లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఆయనను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదన్న భావన కలుగుతుంది.

Also Read : పీక్స్ కు ఫ్యాన్స్ వార్.. రగిలిపోతున్న రెబల్ ఫ్యాన్స్..!

వింటేజ్ చిరంజీవిని చూపించాలనే ప్రయత్నం చేసినా, అది శాతం శాతం సక్సెస్ కాలేదనే చెప్పాలి. వెంకటేష్‌తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పోలిస్తే, ఈ సినిమా అంత ప్రభావవంతంగా అనిపించదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం, కథ కామెడీ మీద పూర్తిగా ఆధారపడటం సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. కొన్ని సన్నివేశాల్లో నటుల అతిశయమైన నటన ఇరిటేషన్ కలిగిస్తుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్, ఆ ఫైట్ డిజైన్ మాత్రం ఆకట్టుకుంటాయి. కథలో చిరంజీవి క్యారెక్టర్‌కు మరింత డెప్త్ ఇచ్చేలా కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు రాసి ఉంటే సినిమా స్థాయి ఇంకాస్త పెరిగేది.

ఫస్ట్ హాఫ్‌లో బుల్లి రాజు క్యారెక్టర్‌తో చేసిన కామెడీ వర్కౌట్ కాలేదు. నవ్వు రాకపోగా ఆ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చే వెంకటేష్ క్యామియో కూడా ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కథలో సహజంగా రావాల్సిన క్యామియోలా కాకుండా, కావాలని జోడించినట్టుగా అనిపిస్తుంది. దాంతో కథ ఫోకస్ కొంత మేర దారి తప్పింది.

నటీనటుల ప్రతిభ

నటీనటుల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేశారని చెప్పాలి. దాదాపు ప్రతి సన్నివేశంలో ఆయన కనిపిస్తూ తన వంతు ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల కామెడీ బాగా పండితే, మరికొన్ని చోట్ల పంచులు అంతగా పేలలేదు. అయినప్పటికీ చిరంజీవి ఎక్కడా తగ్గలేదు. నయనతార తన పాత్రకు తగ్గట్టుగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సచిన్ కేడ్కర్ బిజినెస్ మేన్ పాత్రలో ప్రభావవంతంగా నటించారు. చిరంజీవి గ్యాంగ్‌లోని హర్షవర్ధన్, అభినవ్ గోమటం, కేథరిన్ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా తమ పరిధిలో మంచి ప్రదర్శన ఇచ్చారు.

సాంకేతిక అంశాలు

సినిమాలో పాటలు వినడానికి బాగున్నాయి. భీమ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. ముఖ్యంగా చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్‌లో వచ్చే బీజీఎం బాగా ఎలివేట్ చేస్తుంది. వెంకటేష్ ఎంట్రీ సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో భీమ్స్ ఫ్రెష్ మ్యూజిక్ అందించే ప్రయత్నం చేశారు. కొరియోగ్రఫీ పరంగా చిరంజీవిని చాలా గ్రేస్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. హుక్ స్టెప్ సాంగ్‌కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చక్కగా డిజైన్ చేశారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత విలువ జోడించింది.

మొత్తంగా, ‘మన శంకర వరప్రసాద్’ చిరంజీవి అభిమానులకు కొంతవరకు సంతృప్తినిచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్. అయితే బలమైన కథనం, ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లేది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్