Wednesday, February 4, 2026 11:13 AM
Wednesday, February 4, 2026 11:13 AM

ఆ జిల్లా నేతలపై చంద్రబాబు గుర్రు..!

తెనాలిలో టీడీపీ “టైగర్” రాజా రాజకీయ లీలలు.. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుండి ఏ పార్టీ అభ్యర్థి, ఎన్నికలలో విజయం సాధించగలిగితే, ఆ పార్టీయే అధికారంలోకి రావటం ఖాయం అని 1983 నుండి 2024 వరకు జరిగిన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. 1983, 85, 94, 99, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలవగా, 2024లో టీడీపీ, బీజేపీ పొత్తుతో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 2019లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారో, ఆ పార్టీలే అధికారంలోకి వచ్చాయి. అంతటి ప్రాధాన్యత గల తెనాలిలో తాజాగా జరుగుతున్న ఘటనలు కూటమి పార్టీల అగ్రనేతలను కలవరపరుస్తున్నాయనే మాట బాగా వినిపిస్తోంది. ఇటీవల తెనాలి నియోజక వర్గంలో టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ప్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలిగింపు జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రేమయంతోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆ అనుమానంతోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.

Also Read : తెలంగాణలో పవన్ తో బీజేపీ గేమ్ ప్లాన్ రెడీ..?

అయితే ఫ్లెక్సీలు ఎవరి ఆదేశాలతో తొలిగించారనే విషయం పక్కన బెడితే.. ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో పాటు, ఆయన అభిమానుల అనుమానం కూడా మంత్రి నాదెండ్ల పైనే అన్నది బహిరంగ రహస్యం. తనకు దక్కాల్సిన తెనాలి సీటు.. పొత్తు కారణంగా నాదెండ్ల మనోహర్‌కు దక్కటం.. టీడీపీ కార్యకర్తలు ముద్దుగా పిలుచుకునే టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ టైగర్ ఆలపాటి రాజాకు మింగుడు పడలేదనేది సన్నిహితుల మాట. తన ప్రాభల్యం తెనాలిలో క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో.. తిరిగి ఎలా పెంచుకోవాలని ఆలపాటి అనుకుంటున్న సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగటం.. అందులో టీడీపీ అభ్యర్థిగా ఆలపాటి పోటీ చేసే అవకాశం లభించటంతో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అక్కడ నుంచి రాజకీయంగా ప్రారంభమైన ఆధిపత్య పోరు, క్రమంగా తెనాలిలో నువ్వా-నేనా అన్నట్లుగా మారిపోయింది. మరో విషయం ఏమిటంటే.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తునితో ఆలపాటి కుమ్మక్కు అయ్యారనే విమర్శలు బాగా వినిపించాయి. తనను నోటికొచ్చినట్లు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యేతో ఆలపాటి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు.. రాజాను దూరం పెట్టారని ఎన్నికలప్పుడు జోరుగా ప్రచారం జరిగింది.

Also Read : ట్రాఫిక్ చలానాలపై కఠినత్వం.. రేవంత్ పై విమర్శల వెల్లువ

ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఆలపాటి స్పందించిన తీరుపై పలు విధాలుగా నెగటివ్ ప్రచారం అయ్యింది. ధర్నాలు, నిరసనల సమయంలో తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి హౌస్ అరెస్టు చేయించుకున్నారని.. దీని వల్ల ఖర్చు నుంచి తప్పించుకున్నారనే విషయం కూడా చంద్రబాబుకు పలువురు పార్టీ నేతలు నేరుగా ఫిర్యాదు చేశారు. తెనాలిలో వైసీపీతో టీడీపీ కుమ్మక్కు అయ్యిందని.. అందుకు కారణం ఆలపాటి తీరే అనేది అసలైన టీడీపీ కార్యకర్తల మాట. జనసేనలో నెంబర్ టూ స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్‌కు టికెట్ ఖాయమనేది బహిరంగ రహస్యం. పొత్తు కుదిరిన తర్వాత అదే జరిగింది. అయితే ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి సహా పలువురు మహిళా నేతలు, టీడీపీ కార్యకర్తలు మనోహర్‌కు టికెట్ కేటాయించడాన్ని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. తమను కనీసం సంప్రదించలేదని గగ్గొలు పెట్టారు కూడా.

Also Read : పది నిమిషాల్లో డెలివరీ క్యాన్సిల్.. కేంద్రం వార్నింగ్..!

ఇక ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో ఓ ప్రచారం కూడా బాగా చేశారు. నాదెండ్ల మనోహర్ గెలుపునకు ఆలపాటి మాత్రమే కారణమని.. ఆలపాటి తలుచుకుంటే.. మనోహర్ గెలిచేవారు కాదని తెగ ప్రచారం చేశారు. అదే సమయంలో ఆలపాటి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు బాగా ప్రయత్నం చేశారనే మాట కూడా బాగా వినిపించింది. తాజాగా ఆలపాటి తీరుపై ఇటు పార్టీ పెద్దలు, అటు మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర అసహనంతో ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది. ఆలపాటితో పాటు ఆయన ముఖ్య అనుచరులు భూవివాదాల్లో తలదూరుస్తూ, పార్టీ పరువు తీస్తున్నారని అనేక కధనాలు పత్రికల్లో వచ్చాయి. తాను వైసీపీతో పోరాడుతుంటే.. ఎమ్మెల్సీ ఆలపాటి మాత్రం పరోక్షంగా వైసీపీతో కుమ్మక్కు అయ్యారని మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇటీవల కొన్ని ఆధారాలతో సీఎం చంద్రబాబుకు స్వయంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోయాక నాటి వైసీపీ ఎమ్మెల్యేలతో లాలూచి పడిన టీడీపీ మాజీల్లో ఆలపాటి పేరు బాగా వినిపించింది.

Also Read : విజయ్ ను సిబిఐ ఏం అడిగింది..?

గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుల్లో చాలా మంది ఇప్పటికీ వైసీపీ నేతలతో తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అనుమానం. అందుకే ఈ జిల్లా నేతలకు ప్రాధాన్యత గల నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం లేదనే మాట బాగా వినిపిస్తోంది. అధికారం లేనప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల్లో ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలతో తెర వెనుక రాజకీయాలు చేశారనే బలమైన సాక్ష్యాలు చంద్రబాబు దగ్గర ఉన్నాయంట. అందుకే గుంటూరు జిల్లా టీడీపీ నేతలను చంద్రబాబు నమ్మటం లేదని పార్టీలో వినిపిస్తున్న మాట. అందుకే వారిని అసలు పట్టించుకోవటం లేదు. దీనికి నిదర్శనం గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవి కూడా ఈ జిల్లా వారికి కాకుండా.. పల్నాడు జిల్లా వారికి దక్కటమే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

పోల్స్