Monday, March 23, 2026 05:47 PM
Monday, March 23, 2026 05:47 PM

శ్రీశైలం డ్యామ్ పునాదులు కదులుతున్నాయా..? రంగంలోకి దిగిన కేంద్రం..!

రెండు తెలుగు రాష్ట్రాల సాగు, జల విద్యుత్ లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న శ్రీశైలం ప్రాజెక్ట్ రక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గత కొన్నేళ్ళుగా.. భారీ వరదలు వచ్చిన సమయంలో డ్యామ్ దిగువన ఉన్న ఫ్రెంజ్ పూల్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మరమ్మత్తు పనులను చేపట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు భారీ ఎత్తున నీరు కిందకు పడుతుంది. అలా పడే నీటి వేగాన్ని, దాని వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకోవడానికి డ్యామ్ దిగువన నిర్మించిన ఒక రకమైన కొలనునే ఫ్రెంజ్ పూల్ అంటారు.

Also Read : ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు

ఇది డ్యామ్ పునాదులకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒకవేళ ఇక్కడ గుంతలు పడినా లేదా నిర్మాణం దెబ్బతిన్నా, అది నేరుగా డ్యామ్ ప్రధాన గోడ స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. గతంలో వచ్చిన భారీ వరదల ధాటికి ఫ్రెంజ్ పూల్ వద్ద ఉన్న రక్షణ కవచాలు, ముఖ్యంగా స్టీల్ సిలిండర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నీటి ఉధృతికి ఈ సిలిండర్లు వంగిపోవడం లేదా కొట్టుకుపోవడం జరిగింది. దెబ్బతిన్న పాత స్టీల్ సిలిండర్ల స్థానంలో అత్యంత నాణ్యమైన, దృఢమైన కొత్త సిలిండర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Also Read : జగన్‌తో ఒంటరి పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే..!

ఈసారి మరింత ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, భవిష్యత్తులో ఎంతటి భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా వీటిని అమర్చనున్నారు. ఈ మరమ్మత్తు పనులను సాధారణ పద్ధతిలో కాకుండా, కేంద్ర జల సంఘం సూచించిన కఠినమైన నిబంధనల ప్రకారం అధికారులు చేపడతారు. కొత్తగా ఏర్పాటు చేసే సిలిండర్ల డిజైన్, నాణ్యతను కేంద్ర జల సంఘం నిపుణులు ఇప్పటికే పరిశీలించారు. నీటి అడుగున జరిగే పనులు కాబట్టి, ప్రత్యేక గజ ఈతగాళ్లు, రోబోటిక్ కెమెరాల సాయంతో పనుల పురోగతిని పర్యవేక్షించనున్నారు. వర్షాకాలం ప్రారంభమై, మళ్లీ వరదలు రాకముందే ఈ కీలకమైన పనులను పూర్తి చేయాలని గడువు విధించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కావలి టీడీపీలో గ్రూపు...

ఓ వైపు టీడీపీ అధిష్టానం, సిఎం...

జగన్‌తో ఒంటరి పోరాటం...

ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఎమ్మెల్యే...

ఏపీలో ఏనుగు దంతాల...

వన్య ప్రాణుల భద్రత విషయంలో ప్రభుత్వాలు...

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

పోల్స్