Monday, March 23, 2026 04:35 PM
Monday, March 23, 2026 04:35 PM

తీన్మార్ రచ్చ.. కేసుల గోల..!

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆదివారం ఉదయం మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. మొదట తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత ప్రేరణతో తమపై దాడికి దిగారని, ఆస్తి ధ్వంసం చేసి తనను హత్య చేసేందుకు యత్నించారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఐపీసీ 147, 148, 452, 307, 427, 506, 353 రెడ్ విత్ 149, 109 సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : అన్ని ఉత్త ప్రగల్భాలేనా..?

మరోవైపు జాగృతి కార్యకర్త లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు అయ్యింది. మల్లన్న వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూ న్యూస్ కార్యాలయం వద్దకు వెళ్లగా, మల్లన్న వర్గం తమపై దాడి చేసి కత్తులు, తుపాకులతో మహిళలను బెదిరించారని, మర్యాదకు భంగం కలిగించారని ఆరోపించారు. దీనిపై 354 బీ, 307, 506, 147, 148, ఆర్మ్స్ యాక్ట్ 25, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శ్రీశైలం డ్యామ్ పునాదులు...

రెండు తెలుగు రాష్ట్రాల సాగు, జల...

కావలి టీడీపీలో గ్రూపు...

ఓ వైపు టీడీపీ అధిష్టానం, సిఎం...

జగన్‌తో ఒంటరి పోరాటం...

ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఎమ్మెల్యే...

ఏపీలో ఏనుగు దంతాల...

వన్య ప్రాణుల భద్రత విషయంలో ప్రభుత్వాలు...

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

పోల్స్