సాధారణంగా రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా పరిగణిస్తూ ఉంటాయి. ఒక రాష్ట్రంలో బలపడాలన్నప్పుడు జాతీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను అవకాశంగా తీసుకుంటాయి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర రాజకీయాలతో పాటుగా సరిహద్దు రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల తో పాటుగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. రాజకీయంగా బలోపేతం కావాలని 2019 నుంచి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
Also Read : ఏకంగా రూ.70 వేల కోట్ల స్కామ్..!
2023 అసెంబ్లీ ఎన్నికల తో పాటుగా 2024 ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. అయితే.. స్థానిక సంస్థలు ఎన్నికలకు ముందు ఏపీ ఫార్ములాను తెలంగాణలో అమలు చేస్తారని అందరూ భావించారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో ముందుకు రావడం లేదు. పోటీ చేసేందుకు మిత్రపక్షాలు సిద్ధంగా ఉన్నా సరే తెలంగాణలో వాళ్లను దూరం పెడుతోంది బిజెపి. తెలంగాణలో టిడిపి బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తోంది. కానీ బిజెపి కారణంగా అక్కడ టిడిపి వెనకడుగు వేస్తోంది. జనసేన, టిడిపి లకు అక్కడున్న బలంతో బిజెపి ఖచ్చితంగా రెండో స్థానంలో ఉండే అవకాశాలు ఉంటాయి.
Also Read : Poll : అయేషా మీరా కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా?
అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు మొత్తం కూడా బిజెపికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భారత రాష్ట్ర సమితి కూడా అదే ఎదురుచూస్తోంది. కాంగ్రెస్ నష్టపోవాలి అంటే ముందు టిడిపి ఓటు బ్యాంకు దూరం కావాలనేది గులాబీ పార్టీ ప్లాన్. కానీ ఇక్కడ బిజెపి ఆడుతున్న మైండ్ గేమ్ తో కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. త్వరలో జరగబోయే పరిషత్ ఎన్నికల్లో కూడా దాదాపుగా ఇదే జరిగే అవకాశాలు ఉండవచ్చు. ఇక బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి కూడా భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉన్నా సరే.. ఆ పార్టీ నాయకత్వం దూరం పెడుతోంది. దీనితో తెలంగాణలో గులాబీ పార్టీకి బిజెపి నుంచే పరోక్షంగా దెబ్బ తగులుతుంది.

