దాదాపు రెండు దశాబ్దాల నుంచి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లు జరగటం లేదు. 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఐసీసీ ఈవెంట్ లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే మారే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. భారత్ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నప్పటికీ బంగ్లాదేశ్ వైఖరి మారటం లేదు.
Also Read : పేకాట ఆడితే జైలే.. ఏపీ హైకోర్ట్ సంచలనం
అలాగే హిందువులపై జరుగుతున్న దాడుల వ్యవహారం కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఈ పరిణామాలతో అక్కడ హిందువులు బతుకు జీవుడా అంటూ పరుగులు తీస్తున్నారు. దానికి తోడు అక్కడి రాజకీయ పార్టీలు యువతను రెచ్చగొడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో అలజడలు సృష్టిస్తామని వార్నింగ్ లు ఇస్తున్నాయి. ఈ తరుణంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య భవిష్యత్తులో క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయా అనే ప్రశ్న వినపడుతోంది. పాకిస్తాన్ మాదిరిగానే భారత్ బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా వ్యవహరించవచ్చు అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఐపీఎల్ కు సంబంధించి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజూర్ రెహమాన్ ను కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
Also Read : టాలీవుడ్‌లో సంక్రాంతి భయం..!
ఇటీవల జరిగిన మినీ వేలంలో అతనిని కేకేఆర్ 9 కోట్లకు కొనుగోలు చేసింది. దీనితో అతని స్థానంలో మరో ఆటగాడిని తీసుకోనున్నారు. ఇప్పటికే ఐపీఎల్ నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పక్కనపెట్టింది. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించడంతో.. ఈ ప్రభావం అంతర్జాతీయ మ్యాచ్ లపై కూడా పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లో తమ దేశంలో భారత్ వన్డేలు, టి20లు ఆడాలని.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. కానీ దీనిపై మన బోర్డు మాత్రం ఇంకా స్పందించలేదు. పరిణామాలు ఇలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో బంగ్లాదేశ్ తో క్రికెట్ మ్యాచ్ లు కష్టమే అని చెప్పవచ్చు.

