Wednesday, February 4, 2026 11:28 PM
Wednesday, February 4, 2026 11:28 PM

మెంటార్ గా ధోనీ.. ఆ బౌలర్ కావాలి.. రోహిత్ పట్టు..!

ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర ఓటమి తర్వాత టీమిండియా నష్ట నివారణ చర్యలకు దిగుతుంది. ఎలాగైనా సరే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని బీసీసీఐ కూడా పట్టుదలగా ఉంది. ఈ విషయంలో ఆటగాళ్లపై కూడా కఠినంగానే వ్యవహరించేందుకు బోర్డు పెద్దలు సిద్ధమయ్యారు. ఇక చాంపియన్ ట్రోఫీ గెలిచి ఘనంగా క్రికెట్ నుంచి తప్పుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Also Read : ‘సీఎం ఫెలోస్’.. ఏంటి.. ఎలా పనిచేస్తుంది?

ఛాంపియన్స్ ట్రోఫీ మెంటార్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ని నియమించే అవకాశాలున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. క్రికెట్లో సుదీర్ఘ అనుభవంతో పాటుగా మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచిన కెప్టెన్ గా ధోని నిలిచాడు. దీనితో అతని సలహాలతో ఛాంపియన్ ట్రోఫీలో అడుగు పెట్టాలని భారత్ భావిస్తోంది. జట్టు ఎంపిక విషయంలో కూడా ధోని సలహాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్ తో సిరీస్ తర్వాత జట్టు ఎంపిక జరిగే అవకాశం ఉంది. కొంత మంది యువ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించాలని బోర్డు భావిస్తోంది.

Also Read : పిలుపు దూరంలో మంత్రి.. ఏపీ కేబినేట్ లో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్..!

ఇక చాంపియన్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకొని కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ అలాగే రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ సహా పలువురు కీలక ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో కూడా ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రంజీ ట్రైనింగ్ క్యాంపులో వీళ్ళు పాల్గొన్నారు. ఛాంపియన్స ట్రోఫీలో ఓడిపోతే మాత్రం కచ్చితంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో బోర్డు పెద్దలు కఠినంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. వన్డే జట్టులోకి అర్శదీప్ సింగ్ ను తీసుకొచ్చే విషయంలో గౌతమ్ గంభీర్ సానుకూలంగా లేడు అనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అర్షదీప్ సింగ్ ను తీసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్