Monday, October 12, 2026 11:01 AM
Monday, October 12, 2026 11:01 AM

ఎన్టీఆర్ కట్టించిన ఇల్లు.. ప్రజల కోసం బాలయ్య కీలక నిర్ణయం

హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగులు వేస్తోంది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని శాశ్వతంగా అమలు చేసేందుకు వీలుగా రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ప్రజా ప్రయోజనాల కోసం ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా జూబ్లీహిల్స్ లోని తన నివాస స్థలాన్ని ఇచ్చేందుకు ఆయన ముందుకు వచ్చారు.

Also Read : వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌.. BC లకే రికార్డు స్థానాలు

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బాలకృష్ణకు చెందిన దాదాపు 862.77 చదరపు గజాల స్థలాన్ని రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం సేకరించనుంది. దీనికి బాలకృష్ణ పూర్తి అంగీకారం తెలిపారు. అంతేకాకుండా, ఈ స్థలానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి నగదు పరిహారం తీసుకోకుండా.. కేవలం ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ లతోనే స్థలాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. బాలకృష్ణతో పాటు కేబీఆర్ పార్క్ ప్రధాన ప్రవేశద్వారం జంక్షన్ వద్ద ఉన్న తమ స్థలాన్ని ఇచ్చేందుకు ప్రముఖ శబ్దాలయ స్టూడియోతో పాటు భవ్య కన్‌స్ట్రక్షన్స్ కూడా ముందుకు వచ్చాయి.

ఈ స్థలంతో నందమూరి కుటుంబానికి ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. నందమూరి బాలకృష్ణ కోసం ఆయన తండ్రి, ఎన్టీఆర్ స్వయంగా 1982లో ఈ నివాసాన్ని నిర్మించి ఇచ్చారు. దశాబ్దాలుగా బాలకృష్ణ ఇదే ఇంట్లో నివసిస్తున్నారు. నందమూరి కుటుంబంలో జరిగే వేడుకలన్నింటికీ ఈ ఇల్లే ఒక ప్రధాన వేదికగా నిలిచింది. ఒకప్పుడు ఎన్టీఆర్ సైతం తన అభిమానులను ఈ ఇంట్లోనే కలుసుకునేవారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల వల్ల బాలకృష్ణ నివసిస్తున్న ఈ భవనం సగానికి పైగా పోనుంది. దీంతో అంతటి అనుబంధం ఉన్న ఇంటిని వదులుకుని ఆయన త్వరలోనే వేరే చోటుకు నివాసం మార్చాల్సి వస్తోంది.

Also Read : ఆధార్‌లో పేరు మార్చుకోవాలా? కొత్త నిబంధనలు.. అవసరమైన పత్రాలు ఇవే!

ఈ స్థలాల సేకరణ పూర్తయి రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుండి కేబుల్ బ్రిడ్జి, దుర్గం చెరువు, నాలెడ్జ్ సిటీ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తప్పనున్నాయి. ప్రయాణ సమయం కూడా గణనీయంగా ఆదా అవుతుంది. జూబ్లీహిల్స్ లోపలి కాలనీలు, గచ్చిబౌలి, పశ్చిమ ఐటీ కారిడార్‌తో ఫిల్మ్‌నగర్ జంక్షన్‌ను అనుసంధానించేందుకు ఈ విస్తరణ ఎంతో దోహదపడనుంది. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావించి కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని, ఎంతో ఎమోషనల్ వాల్యూ ఉన్న నివాసాన్ని రోడ్డు విస్తరణకు అప్పగించిన నందమూరి బాలకృష్ణ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రాష్ట్రంలో కరువు ముప్పు.....

తెలంగాణలో రానున్న రోజుల్లో తీవ్ర నీటి...

వైసీపీ కుట్రలకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం...

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

పోల్స్