Monday, October 12, 2026 08:06 AM
Monday, October 12, 2026 08:06 AM

వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌.. BC లకే రికార్డు స్థానాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయానికి సిద్ధమైంది. BC రిజర్వేషన్ల సమగ్ర అధ్యయనం కోసం నియమించిన వన్-మ్యాన్ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదముద్ర పడటంతో స్థానిక సంస్థల్లో BC ప్రజాప్రతినిధులకు సింహభాగం సీట్లు లభించనున్నాయి.

Also Read : ఆధార్‌లో పేరు మార్చుకోవాలా? కొత్త నిబంధనలు.. అవసరమైన పత్రాలు ఇవే!

రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సేకరించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ డేటా ఆధారంగా వన్-మ్యాన్ కమిషన్ ఈ నివేదికను పక్కాగా రూపొందించింది. గతంలో రిజర్వేషన్ల కేటాయింపులో వచ్చిన న్యాయపరమైన చిక్కులను అధిగమించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఈ సిఫారసులు తయారుచేశారు. దీనివల్ల చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా బీసీలకు పూర్తిస్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం, న్యాయం చేకూరేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

మరోవైపు గత కొన్ని రోజులుగా బీసీ రిజర్వేషన్ల అంశంలో వైసీపీ చేసిన కుట్రలు, తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ ప్రభుత్వం ఈ కీలక ముందడుగు వేసింది. అధికారం కోల్పోయిన ఓర్వలేక వైసీపీ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తూ, అనవసర వివాదాలు సృష్టిస్తూ స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యం దక్కకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోంది.

Also Read : బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం..!

కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు నూతన రిజర్వేషన్ల ప్రకారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది. బీసీల సంక్షేమమే ధ్యేయంగా, వారిని రాజకీయంగా అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

పోల్స్