ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది నుంచి అనేక సంచలనాలకు వేదికగా మారుతోన్న లిక్కర్ కేసులో కీలకంగా భావిస్తోన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి ఏపీ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 220 రోజుల నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. గత ఏడాది జూన్ 17 న ఆయనను బెంగళూరులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసును విచారిస్తున్న సిట్ అధికారులకు అప్పగించారు.
Also Read : మాట జాగ్రత్త.. మంత్రులకు సిఎం వార్నింగ్
అప్పటి నుంచి బెయిల్ కోసం చెవిరెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆయన తర్వాత అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి సహా పలువురు బెయిల్ పై బయటకు వచ్చారు. చెవిరెడ్డి ఏ39 గా ఉంటే విజయ సాయి రెడ్డి ఏ 5గా ఉంటే ఆయనను అరెస్ట్ చేయకుండా చెవిరెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. నగదును విదేశాలకు తరలించడంలో చెవిరెడ్డి పాత్ర అత్యంత కీలకంగా భావించారు. కంటైనర్ లో దొరికిన డబ్బులో కూడా ఆయనదే కీలక పాత్రగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల కూడా ఆయన బెయిల్ కోసం ప్రయత్నం చేసారు.
Also Read : ఆధారాల్లేకుండా ఆరోపణలు… ఇదేనా సాక్షి జర్నలిజం?
అయితే అనారోగ్యంతో బాధపడటంతో కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో ఆయన చికిత్స తీసుకునేందుకు కోర్ట్ అనుమతి ఇచ్చింది. తాజాగా హైకోర్ట్ బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఆయనతో పాటుగా వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డికి కూడా కోర్ట్ బెయిల్ ఇచ్చింది. కానీ ఈ కేసులో కీలకంగా భావించే రాజ్ కేసిరెడ్డికి మాత్రం కోర్ట్ బెయిల్ ఇవ్వలేదు. అటు ఈడీ అధికారులు కూడా ఎంటర్ కావడంతో ఈ కేసులో పరిణామాలు ఎటు తిరుగుతాయా అనేది ఆసక్తిగా మారింది.

