ప్రతీ రంగంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. గతంలో మాదిరిగా పత్రాలు మోసుకుని తిరిగే పని లేదు. వాటిని దాచుకోవడానికి తిప్పలు లేకుండా ప్రతీ ఒక్కటి ఆన్లైన్ అయిపొయింది. బర్త్ నుంచి డెత్ వరకు.. మానవ జీవితంతో ముడిపడి ఉన్న ప్రతీ పత్రం ఆన్లైన్ లోనే ఓ ఓటీపీతో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇప్పుడు విద్యా వ్యవస్థకు సైతం ఈ ఆన్లైన్ వ్యవస్థ కీలకం అయిపొయింది. గతంలో సర్టిఫికేట్ లు దాచుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.
Also Read : వైసీపీలో ముసలం.. ఎమ్మెల్యే తిరుగుబావుటా
తాజాగా ఓ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది సర్కార్. ప్రభుత్వం యొక్క ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, లేదా APAAR అనే నెంబర్ ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. దేశం అంతటా.. అంతటా విద్యార్థులకు కేంద్ర డిజిటల్ ఐడిగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ‘వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి’లో భాగంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా, ఈ వ్యవస్థ పలు విభాగాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Also Read : అర్నాబ్.. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా..?
రికార్డ్ కీపింగ్ ను క్రమబద్ధీకరించడానికి ఈ వ్యవస్థను తెచ్చింది. APAAR అనేది పాఠశాల నుండి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి కోసం తీసుకొచ్చిన శాశ్వత విద్యా గుర్తింపు వ్యవస్థ. ఈ ఐడిలో ఎడ్యుకేషన్ ప్రూఫ్స్, మార్క్ షీట్‌లు, స్కోర్‌కార్డ్ లు, గ్రేడ్ షీట్‌లు, సర్టిఫికెట్లు, డిగ్రీలు, స్కూల్స్ లో సాధించిన విజయాలు అన్నీ ఇందులో ఉంచుతారు. నకిలీ రికార్డులను బ్రేక్ చేయడం, పారదర్శకత, ఒక స్కూల్ నుంచి మరో స్కూల్ కు మారే విధానం సులువు చేయడం, ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తులు, నైపుణ్య కార్యక్రమాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

