Friday, February 20, 2026 10:20 PM
Friday, February 20, 2026 10:20 PM

ఆఫ్ ది రికార్డు వార్తలు.. పార్ట్ 2..!

ఆఫ్ ది రికార్డు అంటూ మీడియాలో వచ్చే వార్తల గురించి అందరికీ తెలుసు. తొలిసారి డిజిటల్ మీడియాలో ఆఫ్ ది రికార్డు పేరుతో ఆంధ్ర న్యూస్ 9 చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సిరీస్‌లో మరో న్యూస్ ఆర్డికల్ ఇస్తున్నాం. ఇందులో ఇస్తున్న న్యూస్.. పొలిటికల్, అఫీషియల్ సర్కిల్‌తో పాటు రాజకీయాలపై అవగాహన ఉన్న వాళ్లు చర్చించుకుంటున్నవే.

పీఏ అంటే.. ఇన్ని అర్థాలున్నాయా..!

ముందుగా గతంలో మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు పీఏలుగా పనిచేస్తున్నప్పుడు, వారిని పర్సనల్ అసిస్టెంట్ అంటే తెలుగులో వ్యక్తిగత సహాయకులు అనే వారు. కాలం మారింది. వ్యక్తుల తీరు మారింది. పీఏ పోస్టుకు అర్ధాలు, పరమార్థాలు మారిపోయాయి. తాజాగా పీఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదంట.. పీఏ అంటే పర్సనల్ ఏజెంట్ అని.. పీఏ అంటే ప్రాఫిట్ ఏజెంట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చివరకు పీఏ పోస్టును ఈ విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు అధికారులు, కార్పొరేషన్ చైర్మన్‌లు, చివరకు ఒక గౌరవ పదమైన, రాజ్యాంగ పరమైన వ్యక్తుల దగ్గర పనిచేస్తున్న పీఏ లు ఈ విధంగా మార్చుకున్నారట. ఒక్క పీఏ కు ఇన్ని అర్ధాలు, పరమార్థాలు ఉన్నాయా..! అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : పయ్యావుల విశ్వరూపం.. హాట్ హాట్ గా మండలి..!

పాపం.. శ్రీలక్ష్మి ఏం పాపం చేసింది సార్..!

ఇక మంత్రులు చేసే తప్పులకు చంద్రబాబు మూల్యం చెల్లించుకుంటున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులందరికీ పోస్టింగ్ ఇవ్వటం వెనుక.. మంత్రుల సిపార్సులు బాగా పనిచేస్తున్నాయనే మాట వినిపిస్తోంది. అయితే కాపు కులానికి చెందిన శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వకపోవటంపై టీడీపీ, జనసేన కాపులకు కాస్త అసంతృప్తి కలిగిస్తుందట. ఈ విషయంలో కాపు ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన నాయకులు మౌనంగా భరిస్తున్నారట. కరుడు గట్టిన వైసీపీ ఐఏఎస్‌లు అందరికీ పోస్టింగ్ ఇవ్వటమే కాదు.. వారిలో కొందరికి ప్రాధాన్యత పోస్టులు కూడా ఇచ్చారు. కానీ శ్రీలక్ష్మికి ఇప్పటి వరకు ఇవ్వలేదు. వైసీపీ హయాంలో చంద్రబాబును బూతులు తిట్టిన వారికి కూడా పోస్టింగ్ ఇచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలనే కారణం తప్ప.. చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని శ్రీలక్ష్మిని ఎందుకు పక్కన పెట్టారనేది ఇప్పటికీ అర్థం కావటం లేదని జోరుగా చర్చ నడుస్తోంది.

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారు. శిక్ష అనుభవించారు. నిజానికి అప్పటి ప్రభుత్వ పెద్దల మాట ప్రకారమే నడుచుకున్నందుకే ఇప్పటికీ అవినీతి అధికారి అనే ముద్రతో పాటు ఇప్పటికీ పోస్టింగ్ లేకుండా ఉన్నారు. ఈ విషయంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న అధికారుల్లో శ్రీలక్ష్మి ఒక్కరే తప్పు చేశారా.. మరెవరు తప్పులు చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు కూడా. వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నను ఏరి కోరి మరీ సీఎంఓలో నియమించుకున్న సీఎం చంద్రబాబు.. శ్రీలక్ష్మి విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.

Also Read : బ్రేకింగ్: అనంతబాబు కేసులో ఏపి పోలీసుల పై సుప్రీం తీవ్ర ఆగ్రహం..!

అంబటి జైల్లో ఏం చేశారు..?

ఇక మరో వార్త మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి. డామిడ్ అంబటి కథ అడ్డం తిరిగిందే అనే చర్చ జరుగుతోంది. సంబరాల రాంబాబు రెండు దఫాలు జైలుకు వెళ్లారు. ఇప్పుడు బెయిల్ పైన బయటకు వచ్చారు. వివిధ కారణాలతో అరెస్టు అయిన అంబటి రాంబాబుకు కోర్టునుండి బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర పండుగ చేసుకున్నారు. అందరు సరదాగా పిలుచుకునే సంబరాల రాంబాబు జైల్లో డాన్సులు చేశారా అనే అంశంపై సరదాగా జోకులు పేలుతున్నాయి. బెయిల్ పై విడుదలయ్యే లోపు.. మరో కేసులో రిమాండ్ విధించడంతో.. తగ్గేదే లే అన్నట్లు సైగలు చేసి మరీ ఎందుకు రెచ్చగొట్టారని చర్చించుకుంటున్నారు. ఇలా రెచ్చ గొట్టడం వల్లే.. రాంబాబును టీడీపీ నేతలు టార్గెట్ చేశారని.. చేసిన తప్పునకు రాంబాబులో పశ్చాతాపం లేదని జోరుగా చర్చించుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ విషయంలో టార్గెట్...

మంత్రి నారా లోకేష్ శ్రీలంక పర్యటనపై...

పరారీలో వైసీపీ ఎమ్మెల్సీ..!

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో...

బొత్సకు లోకేష్ అదిరిపోయే...

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లడ్డూ రాజకీయం...

బ్రేకింగ్: అనంతబాబు కేసులో...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సంచలనం...

సోషల్ మీడియాలో జగన్...

అన్నొస్తున్నాడు.. అందరికీ మంచి జరుగుతుంది.. అనేది...

పయ్యావుల విశ్వరూపం.. హాట్...

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు వాడీ,...

పోల్స్