Friday, April 10, 2026 03:58 PM
Friday, April 10, 2026 03:58 PM

ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఏపీ సర్కార్..!

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యూటీ, సరెండర్ లీవ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికోసం దాదాపు రూ. 2,950 కోట్లను కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గతంలో నిలిచిపోయిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తోంది. ఈ నిధుల విడుదల ద్వారా వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరనుంది.

Also Read : మావిగన్ పై తిట్లేనా..? చేసే అభివృద్ధి చెప్పుకోలేరా..?

నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే ఈ నిధులు జమ కానున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న పోలీసు ఉద్యోగులకు కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీసుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను కూడా ప్రభుత్వం నేడు ప్రారంభించింది. హోం శాఖలో ఉన్న దాదాపు 60,000 మంది సిబ్బందికి మేలు చేకూరుస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలు విడుదల కావడంతో రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు తొలగనున్నాయి.

Also Read : ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పెండింగ్ అరియర్స్ ను కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని ఏపీ సర్కార్ చెప్తోంది. బిల్లుల చెల్లింపులో ఎటువంటి గందరగోళం లేకుండా, ఏ ఏడాదిలో రిటైర్ అయ్యారు అనే సీనియారిటీ ప్రాతిపదికన బిల్లులను క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా 2022, 2023 సంవత్సరాల్లో రిటైర్ అయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇది పెద్ద ఊరటగా చెప్తున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. కేవలం గ్రాట్యూటీ మాత్రమే కాకుండా, మెడికల్ రీయంబర్స్మెంట్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ ను కూడా దశల వారీగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేబినెట్ సమాచారం లీక్.....

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన...

ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!

తెలుగుదేశం పార్టీలో సింగిల్ టైం ఎమ్మెల్యేలకు...

వైఎస్ఆర్ మరణానికి జగనే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం...

ఢిల్లీ వెలుపల మరో...

అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి మరో...

బ్రేకింగ్: మహానాడు పై...

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే...

మావిగన్ పై తిట్లేనా..?...

ఏపీ రాజకీయాల్లో గత పది రోజుల...

పోల్స్