Sunday, March 22, 2026 04:35 AM
Sunday, March 22, 2026 04:35 AM

బ్రేకింగ్: గోదావరి పుష్కరాల తేదీలు ఇవే.. చంద్రబాబు ఖాతాలో హ్యాట్రిక్ రికార్డ్..!

గోదావరి పుష్కరాలు.. భక్తులు ఎంతో ఆసక్తిగా, భక్తి శ్రద్దలతో ఎదురు చూస్తే.. అత్యంత ప్రతిష్టాత్మక పుష్కరాలు. మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణించే గోదారమ్మ పుష్కరాల కోసం దేశ వ్యాప్తంగా ఎందరో భక్తులు హాజరు అవుతూ ఉంటారు. గోదావరి నదిలో పుష్కర స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు ఈ మూడు రాష్ట్రాలకు రావడం చూస్తూనే ఉంటాం. దీనితో ఈ పుష్కరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో పకడ్బందీగా, అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.

Also Read :గౌహతీ టెస్ట్ ను టీమిండియా డ్రాతో ముగిస్తుందని భావిస్తున్నారా?

తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గోదావరి పుష్కరాల తేదీలను కేంద్రం ప్రకటించింది. గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు చేసారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీనితో ముందస్తుగా గోదావరి పుష్కరాల కోసం కేంద్రం నిధులను కేటాయించింది. ఇప్పటికే పుష్కరాల కోసం రూ.100 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరిన్ని నిధులను కేటాయించింది. భక్తులకు ఏ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలకు నిధులు కేటాయించింది.

Also Read : బ్రేకింగ్: కొత్త జిల్లాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కోసం రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు రూ.271.43 కోట్లు కేటాయిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు తెలంగాణాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తారు. ఇక ఏపీలో రెండు జిల్లాల్లో ఈ పుష్కరాల నిర్వహణ ఉండనుంది. ఇదిలా ఉంచితే.. వరుసగా మూడు సార్లు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నారు. 2003లో ఉమ్మడి ఏపీ సిఎంగా.. 2015 లో విభజిత ఆంధ్రప్రదేశ్ సిఎంగా, ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పుష్కరాలను నిర్వహించనున్నారు. తొలిసారి తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్కరాలు నిర్వహించే అవకాశం లభించనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్