Friday, April 10, 2026 05:51 PM
Friday, April 10, 2026 05:51 PM

దేవర 2.. బరిలోకి మరో బాలీవుడ్ స్టార్ విలన్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర పార్ట్ 1 సాధించిన భారీ విజయం తర్వాత, ఇప్పుడు అందరి కళ్లు పార్ట్ 2పైనే పడ్డాయి. ఈ సీక్వెల్‌ కు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పార్ట్‌ లో ఉండబోయే కొత్త విలన్ గురించి వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. సెకండ్ పార్ట్‌ లో ఎన్టీఆర్‌ ను ఢీకొట్టే పవర్‌ ఫుల్ విలన్‌ గా బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ నటించబోతున్నట్లు సమాచారం.

Also Read : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఏపీ సర్కార్..!

ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ భైర పాత్రలో మొదటి భాగంలో అలరించగా, పార్ట్ 2లో బాబీ డియోల్ ఎంట్రీతో విలనిజం రెట్టింపు కానుంది. యానిమల్ సినిమాలో తన సైలెంట్ విలనిజంతో మెప్పించిన బాబీ, ఇప్పుడు దేవర సముద్ర తీరంలో తారక్‌ తో తలపడనుండటం విశేషం. అలాగే మరింత పవర్‌ ఫుల్‌ గా సైఫ్ పాత్ర ను డిజైన్ చేసినట్లు టాక్. మొదటి భాగంలో భైర పాత్ర కొంతవరకు మాత్రమే పరిమితం కాగా, పార్ట్ 2లో సైఫ్ అలీ ఖాన్ పాత్ర మరింత క్రూరంగా, పవర్‌ ఫుల్‌ గా ఉండబోతోందని దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

Also Read : ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!

కొరటాల శివ ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్‌ ను పూర్తి చేసి, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు. సీక్వెల్‌ ను పార్ట్ 1 కంటే భారీ స్థాయిలో, మరిన్ని ఎమోషనల్ ట్విస్టులతో తీర్చిదిద్దుతున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ తన డ్రాగన్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత.. మే నుండి దేవర 2 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిర్మాత సుధాకర్ మిక్కిలినేని పేర్కొన్నారు. ఈ సినిమాను 2027 లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. మొత్తానికి దేవర 2 లో ఇద్దరు బాలీవుడ్ స్టార్ విలన్లు తారక్ చేసే పోరాటం బాక్సాఫీస్ వద్ద మరోసారి సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేబినెట్ సమాచారం లీక్.....

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన...

ఉద్యోగులకు ఇచ్చిన హామీ...

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల...

ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!

తెలుగుదేశం పార్టీలో సింగిల్ టైం ఎమ్మెల్యేలకు...

వైఎస్ఆర్ మరణానికి జగనే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం...

ఢిల్లీ వెలుపల మరో...

అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి మరో...

బ్రేకింగ్: మహానాడు పై...

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే...

పోల్స్