Monday, April 6, 2026 08:12 PM
Monday, April 6, 2026 08:12 PM

మావోల డెన్ లో భారీ ఎన్కౌంటర్..?

1990 ల నుంచి మావోలకు అడ్డాగా మారిన కర్రెగుట్టలలో మరోసారి ఆపరేషన్ కగార్ వేగవంతం అయింది. కర్రెగుట్టలు 2.౦తో ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి బలగాలు. మార్చ్ 31 నాటికి దేశంలో మావోయిస్ట్ అనే మాట వినపడకుండా చేయాలని పావులు కదుపుతున్న బలగాలు.. మళ్ళీ దూకుడు పెంచాయి. నిర్భంధం ఎక్కువ కావడంతో మావోలు తమకు సేఫ్ జోన్ గా భావించే కర్రెగుట్టల వైపు మరోసారి కదిలినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కర్రెగుట్టలలలో కూంబింగ్ ఆపరేషన్ కూడా వేగవంతం అయింది.

Also Read : ఆ నేతకు బ్రేకులు ఎందుకు వేయలేకపోతున్నారు..?

ఇక తాజాగా కేంద్ర బలగాలు ఆపరేషన్‌ కర్రెగుట్టలు-2ను బుధవారం ప్రారంభించి గాలింపు మొదలుపెట్టాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ చీఫ్‌ దేవ్‌ జీతో పాటు కోసా, దామోదర్‌, పాపారావు వంటి కీలక నాయకులు కర్రెగుట్టల్లోనే తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టాయి బలగాలు. దాదాపుగా 290 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని కొండపల్లి సీతారామయ్య ఉన్నప్పుడే.. తమ షెల్టర్ జోన్ గా గుర్తించారు. మావోయిస్ట్ అగ్ర నాయకులు ఇక్కడే ఉండేవారు.

Also Read : నా దుడ్లుతో కొనుక్కున్నా.. వైసీపీకి లోకేష్ మార్క్ కౌంటర్..!

ఆరు నెలల క్రితం ఇక్కడ ఆపరేషన్ జరగగా అప్పుడు కీలక మావోలను హతమార్చారు. ఇప్పుడు మళ్ళీ పోలీసుల నిఘా తగ్గడంతో వాళ్ళు అక్కడికి చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా ఇక్కడ భారీ ఎన్కౌంటర్ జరగగా ఐదుగురు మావోలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అగ్ర నేతలు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మావో కీలక నేతలు.. భూపాలపల్లి – ములుగు అటవీ ప్రాంతంలో కూడా సంచరించే అవకాశం ఉండవచ్చనే అనుమానాల నేపధ్యంలో అక్కడ కూడా ఆపరేషన్ వేగవంతం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇలా అయితే కష్టమే.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

అధికారుల తీరును బహిరంగంగా.....

అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన ఏపీ...

నరసరావుపేటలో వైసీపీలో రచ్చరచ్చ.....

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వైసీపీలో.....

సట్టా బజార్ షాకింగ్...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ...

ఏపీలో మరో రేపిస్ట్...

ఏపీలో అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం...

యుద్ధం.. అప్రకటిత లాక్...

పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను...

పోల్స్