Saturday, February 7, 2026 09:28 PM
Saturday, February 7, 2026 09:28 PM

కొంగు జిల్లాల్లో అన్నాడిఎంకే స్వింగ్ షురూ..!

తమిళనాట రాజకీయం మారుతోంది. ఇప్పటి వరకు సిఎం స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె దూకుడుగా కనపడినా ఒక్కసారిగా అన్నాడిఎంకె తమిళనాట తన గేమ్ ప్లాన్ అమలు చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. డిఎంకె కూటమిని మించి ఎన్డియే కూటమి క్రమంగా బలపడుతోంది. వివిధ పార్టీలు ఒకదాని తర్వాత ఒకటిగా అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరుతున్నాయి. ఇప్పటికే, ఎన్డీఏ కూటమిలో పీఎంకే, ఏఎంఎంకే, తమిళ మానయ కాంగ్రెస్, పురచ్చి భారతం, జాన్ పాండియన్, ఫార్వర్డ్ బ్లాక్, పుతియా నీతి పార్టీ, ఐజేకే వంటి పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే.

Also Read : పాకిస్థాన్‌ లోనూ ‘ధురంధర్’ విధ్వంసం

ఆ పార్టీలతో పాటుగా.. పుతియా తమిళనాడు, డీఏండీకే పార్టీలతో అన్నాడిఎంకే నాయకత్వం చర్చలు వేగవంతం చేసింది. విజయ్ రాక కారణంగా, గెలుపు ఓటముల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంటుందని అంచనాల నేపధ్యంలో.. రెండు పార్టీలు అధికారాన్ని వదులుకోవద్దనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తున్న అన్నాడిఎంకే వేగంగా పావులు కదుపుతోంది. తాజాగా కొంగు ప్రోగ్రెస్ పార్టీ, కొంగునాడు ప్రోగ్రెస్ పార్టీలు అన్నాడిఎంకె నేతృత్వంలోని కూటమిలో చేరాయి.

Also Read : రెండు పాత్రల్లో నట సింహం గర్జన..? బాలయ్యను వాడేస్తున్న డైరెక్టర్..!

సేలంలో ఎడప్పాడి పళనిస్వామిని కలిసిన రెండు పార్టీల అధినేతలు తమ మద్దతు లేఖలు అందించారు. కొంగు జిల్లాల్లో ఇప్పటికే అన్నాడిఎంకే బలంగా ఉండగా.. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీల చేరికతో క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనపడుతోంది. అయితే డెల్టా జిల్లాల్లో మాత్రం డిఎంకె కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళ దేశం పార్టీ అక్కడ కాస్త కీలక పాత్ర పోషిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కుల చిచ్చు కోసం...

రాజకీయాల్లో కులాలు మతాలు అనేవి ఈ...

సిగ్గు సిగ్గు.. జగన్‌...

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా...

నమ్మకం లేదు.. కానీ...

ఎవరి మీదైనా నమ్మకం లేకపోతే.. వాళ్లు...

ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.....

కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమల లడ్డూ...

తెలంగాణకు ఎవరు జాతిపిత..?

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా...

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి...

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో...

పోల్స్