Thursday, March 19, 2026 08:37 PM
Thursday, March 19, 2026 08:37 PM

ఉద్యోగాలకు ‘ఏఐ’ ఎసరు, 90 శాతం కంపెనీల సంచలన నిర్ణయం..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు భారీగా ఉద్యోగాలు పోయే అవకాశం ఉందా..? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. తాజాగా ప్రముఖ సంస్థ ‘రెస్యూమ్ బిల్డర్’ నిర్వహించిన సర్వే ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వచ్చే ఏడాది కాలంలో దాదాపు 90 శాతం కంపెనీలు తమ కార్యకలాపాల్లో ఏఐని అంతర్భాగం చేయడమే కాకుండా, మానవ వనరుల స్థానంలో యంత్రాలను చేర్చే యోచనలో ఉన్నాయని ఈ సర్వే సంచలన విషయాలు బయటపెట్టింది.

Also Read : మూవీ రివ్యూ : దురంధర్: ది రివెంజ్

కంపెనీలు ఏఐ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యంగా కనపడుతోంది. ఒక ఉద్యోగికి చెల్లించాల్సిన జీతం, ఇన్సూరెన్స్, బోనస్, ఇతర భత్యాలతో పోలిస్తే, ఒక ఏఐ సాఫ్ట్‌వేర్ నిర్వహణ ఖర్చు చాలా తక్కువ అని కంపెనీలు భావిస్తున్నాయి. దాదాపు 40 శాతం కంపెనీలు ఇప్పటికే తమ పనులను ఏఐతో పూర్తి చేస్తున్నాయని, వచ్చే ఏడాదిలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని సర్వే వెల్లడించింది. భవిష్యత్తులో మార్కెట్‌లో నిలబడాలంటే ఏఐపై పెట్టుబడులు పెట్టడం తప్పనిసరని కంపెనీల సీఈఓలు అభిప్రాయపడుతున్నట్లు ఆ సంస్థ అభిప్రాయపడింది.

Also Read : కవిత పార్టీ పేరు ఇదే..? పొలిటికల్ రీ-ఎంట్రీకి రెడీ..!

ఈ మార్పు అన్ని రంగాల్లో ఒకేలా ఉండదని, కొన్ని రంగాల్లో మాత్రం ఉద్యోగ కోత ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడింగ్ రాయడం, బగ్‌లను ఫిక్స్ చేయడం వంటి పనులను ఏఐ అద్భుతంగా చేస్తోంది. దీంతో జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అవసరం తగ్గే అవకాశం ఉంది. క్లిష్టమైన డేటాను ప్రాసెస్ చేయడం, రిపోర్టులు తయారు చేయడంలో ఏఐ మానవుల కంటే వేగంగా పనిచేస్తోంది. భవిష్యత్తులో పూర్తిస్థాయి కాల్ సెంటర్లను ఏఐ ద్వారా నడిపించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సర్వేలో తేలిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకునేటప్పుడు వారికి “ఏఐ టూల్స్ వాడటం తెలుసా..?” అని ప్రత్యేకంగా అడుగుతున్నాయట. దాదాపు 91 శాతం సంస్థలు ఏఐ నైపుణ్యం ఉన్న అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తగ్గని పిన్నెల్లి వాయిస్.....

పల్నాడు రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన గుండ్లపాడు...

ఆళ్ల ప్లాన్ రివర్స్.....

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గత...

దెబ్బకు దారిలోకి వచ్చిన...

మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతోన్న...

కవిత పార్టీ పేరు...

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం...

ఏపీకి పండగొచ్చింది.. బాబు...

ఏపీలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అటు...

మూవీ రివ్యూ :...

నటీనటులు: రణ్వీర్ సింగ్, సారా అర్జున్,...

పోల్స్