Friday, September 12, 2025 10:52 PM
Friday, September 12, 2025 10:52 PM
roots

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బీజేపీ..!

ఏపీలో 2024లో భారతీయ జనతా పార్టీ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందనే చెప్పాలి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్‌… దక్షిణాదిలోని ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ.. నాలుగేళ్ల పాటు ఉమ్మడి సర్కార్‌లో భాగస్వామిగా వ్యవహరించింది. అయితే ప్రత్యేక హోదా అంశం టీడీపీ-బీజేపీ మధ్య విబేధాలకు కారణమైంది. దీంతో 2019 ఎన్నికల్లో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ నేతలకు కనీసం ఒక్కచోట కూడా డిపాజిట్లు దక్కలేదు. దీంతో మరోసారి అలాంటి తప్పు చేయకూడదనే నిర్ణయంతో కూటమితో కలిసి పోటీ చేసి… గతంలో ఎన్నడూ ఊహించనన్ని స్థానాలను సొంతం చేసుకుంది.

Also Read: రాజీకి సిద్దం.. రేవంత్ ఇంటికి సినిమా పెద్దలు…!

2014 ఎన్నికల్లో కేవలం 4 స్థానాలు మాత్రమే గెలిచిన బీజేపీ… 2024లో మాత్రం డబుల్ స్థానాలు దక్కించుకుంది. అలాగే లోక్‌సభ స్థానాలను కూడా మూడు గెలుచుకుంది. ఇక కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి రావడానికి ఏపీలో కూటమి పార్టీలకు వచ్చిన స్థానాలే కారణం. ఏపీలో 2023 వరకు కొంతమంది బీజేపీ నేతలు వైసీపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారనే అపవాదు కాషాయ పార్టీ మూటగట్టుకుంది. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత బీజేపీ స్టాండ్ పూర్తిగా మారిపోయింది. ముందుగా ఏపీ బీజేపీ పగ్గాలు సోము వీర్రాజు నుంచి దగ్గుబాటి పురందేశ్వరి చేతికి వచ్చాయి. ఆ తర్వాత నుంచి బీజేపీ నేతల్లో కొత్త జోష్ వచ్చింది.

Also Read: మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. నా కొడుకుని ఆదుకోలేదు…!

అప్పటి వరకు టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వ్యవహరించిన నేతలను ఢిల్లీ పెద్దలు పక్కనపెట్టారు. ఏపీలో గెలవాలంటే కూటమిలో చేరితేనే సాధ్యమంటూ అప్పటికే పలు సర్వే సంస్థలు నివేదికలు ఇచ్చాయి. అలాగే టార్గెట్ వైసీపీ అన్నట్లుగా దూకుడుగా వ్యవహరించాల్సిందే అనే విషయం గుర్తించిన కాషాయా పార్టీ నేతలు… జగన్ సర్కార్‌పై విమర్శలు చేశారు. నాటి ప్రభుత్వంలో జరిగిన తప్పులను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు బయటపెట్టారు. మద్యం, మైనింగ్ మాఫియాపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. దీంతో వైసీపీ కూడా బీజేపీపై విమర్శలు చేయడంతో… శతృత్వం పెరిగిపోయింది.

Also Read: కేటిఆర్ పక్కాగా బుక్ అయ్యాడు.. ఏసీబీ సంచలన అడుగులు

ఇక పవన్ కల్యాణ్ సయోధ్య కుదర్చడంతో ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా చేరింది. ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపులో కాస్త బెట్టు చూపించింది బీజేపీ. ఏకంగా 15 అసెంబ్లీ స్థానాలు, పది పార్లమెంట్ స్థానాలను కోరుకుంది. అయితే సర్వేల నివేదికల ఆధారంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో తొలిసారి పలువురు నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్ వంటి నేతలు తొలిసారి క్షేత్రస్థాయిలో తమ భవిష్యత్తును పరీక్షించుకున్నారు. 10 అసెంబ్లీ స్థానాలకు 8 చోట్ల కమలం పార్టీ వికసించగా… 6 పార్లమెంట్ స్థానాల్లో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం నియోజకవర్గంలో బీజేపీ నేతలు గెలిచారు. ఎన్డీయే సర్కార్‌లో నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. ఇటు ఏపీ ప్రభుత్వంలో సత్యకుమార్ యాదవ్‌కు మంత్రిపదవి దక్కింది.

Also Read: వైసీపీ.. మరీ ఇంత దారుణమా..!

ఎన్డీయే సర్కార్‌లో భాగస్వామి కావడంతో… ఏపీపై మోదీ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తోంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఇక ఇటీవల ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కూడా ప్రస్తుతం బీజేపీ నేతలు పోరాడుతున్నారు. ఇదే సమయంలో గతంలో వైసీపీ కోవర్టులంటూ ముద్రపడిన ముగ్గురు నేతలను బీజేపీ పక్కనపెట్టింది. ప్రస్తుతం ఆ ముగ్గురు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. అలాగే వైసీపీ నుంచి వస్తున్న నేతలకు బీజేపీ రాజకీయ పునరావాసం కల్పిస్తోంది. ఇప్పటికే ఆర్.కృష్ణయ్యను మరోసారి ఎంపీగా ఎంపిక చేసింది బీజేపీ. మొత్తానికి 2024 ఏడాది మాత్రం బీజేపీకి ఏపీలో గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్