టీడీపీ సోషల్ మీడియా గాని టీడీపీ అనుకూల మీడియా గాని చేసే కొన్ని వ్యాఖ్యలు అప్పటికప్పుడు కాకపోయినా కొంత కాలానికి కొన్ని విషయాల్లో నిజం అవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పులివెందుల విషయంలో చేసే కొన్ని కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. పులివెందులలో గాని కడప జిల్లాలో గాని… వైఎస్ బ్రతికి ఉన్న సమయంలో… భాస్కర రెడ్డి కుటుంబ పెత్తనం లేకుండా జాగ్రత్త పడ్డారని, కంట్రోల్ చేయడానికి వైఎస్ భారతీని జగన్ కు ఇచ్చి వివాహం చేసారని… కాని జగన్ వచ్చిన తర్వాత వారి పెత్తనం ఎక్కువైందని…
ఇదే జగన్ కు నియోజకవర్గంలో పట్టు కోల్పోయేలా చేసింది అని అంటూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నవి చూస్తుంటే అది నిజమే అనే భావన వ్యక్తమవుతోంది. 3 నెలల కాలంలో జగన్ పులివెందుల వెళ్ళింది రెండు సార్లు లేదంటే మూడు సార్లు. అప్పుడు కూడా ఆయన పెద్దగా ప్రజలతో మమేకం కాలేదు. కాని అక్కడ పెత్తనం మొత్తం అవినాష్ రెడ్డి ఎంపీ హోదాలో చేస్తున్నారు. వైఎస్ కుటుంబ అభిమానుల్లో, అనుచరుల్లో రెండు వర్గాలు ఉంటాయి. ఆ రెండు వర్గాల్లో ఒక వర్గం అసలు భాస్కర రెడ్డి కుటుంబాన్ని సహించే ప్రశ్నే లేదంటారు కొందరు.
జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి లేదా కష్టాలు చెప్పుకోవడానికి అవినాష్ రెడ్డిని వారధిగా పెట్టారు. అసలు వాళ్లకు సమస్యే అవినాష్ తో అని అంటారు అక్కడి వాళ్ళు. ఆ సమస్య చెప్పుకోవడానికి జగన్ రారు… గతంలో వివేకానంద రెడ్డి ఉన్నప్పుడు చెప్పుకునేవారు. ఇప్పుడు ఆయన లేరు… ఆయన హత్య విషయంలో అవినాష్ రెడ్డి అండ్ కో పై వైఎస్ కుటుంబ అభిమానుల్లో కోపం ఉంది. వాళ్ళు ఇప్పుడు క్రమంగా షర్మిలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా జగన్ కు మెజారిటీ తగ్గడానికి కారణం అదే.
Read Also : బిజెపి కుట్రలకు బలిపశువులుగా సీఎంలు
అవినాష్ పెత్తనంతో అక్కడ కొందరు కార్యకర్తలు పార్టీ జెండా ఇప్పటికే వదిలేశారట. వాళ్ళు జగన్ వచ్చినప్పుడు వచ్చి కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నా భద్రతా కారణాలతో జగన్ ఎవరినీ దగ్గరకు రానీయడం లేదట. ఇక జగన్ బెంగళూరు టూ తాడేపల్లి షటిల్ సర్వీస్ చేయడంతో పులివెందుల వెళ్ళేది తక్కువగానే ఉంది. దీనితో అక్కడ అవినాష్ రెడ్డి క్రమంగా పట్టు పెంచుకుని పార్టీలో చెక్ పవర్ గా ఎదుగుతున్నారు. ఇది క్రమంగా కాంగ్రెస్ కు లేదా టీడీపీకి బలం చేకూర్చే అవకాశం ఉందనే ఆందోళన వైఎస్ కుటుంబ అభిమానుల్లో స్పష్టంగా ఉంది. మరి భవిష్యత్తులో పులివెందుల జగన్ సొంతమా లేక అవినాష్ సొంతమా చూడాలి.




