Tuesday, October 28, 2025 01:54 AM
Tuesday, October 28, 2025 01:54 AM
roots

మూడు రాష్ట్రాల తీవ్ర పోటీలో – ఫాక్స్‌కాన్‌ను ఆంధ్రా పట్టేనా?

బీజింగ్ మరియు వాషింగ్టన్ డీసీ మధ్య భూభౌతిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో, ఫాక్స్‌కాన్ తన కార్యకలాపాలను చైనాకు వెలుపల విస్తరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా అది దేశంలో.. దక్షిణాది రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాసాలను వెతుకుతోంది.

ఫాక్స్‌కాన్‌ను ఆకర్షించడానికి తెలంగాణ, కర్ణాటక & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నాయి. వారు పెట్టుబడులు పెట్టగలిగితే పారిశ్రామికంగా అవసరమైన అన్ని వెసులుబాట్లు ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందుకోసం భూ కేటాయింపులకి కూడా సిద్దపడుతున్నాయి.

Foxconn Team With Nara Lokesh

రాష్ట్రంలో “ఫెసిలిటీ సెంటర్” ఏర్పాటు చేయడానికి, ఫాక్స్‌కాన్ కంపెనీకి 2,000 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిందని తెలంగాణ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అలాగే “పారిశ్రామిక పార్క్” నిర్మాణం కోసం 2,500 ఎకరాల భూమిని కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. “సప్లయర్ పార్క్” కోసం 300 ఎకరాల భూమిని కర్ణాటక అధికారులు ప్రకటించారు.

సింగపూర్ ఫాక్స్‌కాన్ ఇండియాలో వున్న ఫాక్స్‌కాన్ షేర్లను పెద్ద ఎత్తున కొన్నది. ఆ పెట్టుబడులతో ఇక్కడ ఫాక్స్‌కాన్ సిటీ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. షిప్పింగ్ దృష్ట్యా చూస్తే.. ఆంధ్రాకు అవకాశాలు ఎక్కువ. అందులో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్స్ అంటున్న బాబు, చొరవ తీసుకొని ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపారు ఐటిశాఖ మంత్రి నారా లోకేష్. గతంలో శ్రీ సిటీలో దానిని రప్పించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్స్ కు బాబు అందించిన సహకారం అది మరవదు అని భావిస్తున్నా అంటూ పేర్కొన్నారు. ఈ తీవ్ర పోటీలో ఆంధ్రా ఫాక్స్‌కాన్‌ను ఒడిసి పట్టగలిగితే, గత ఐదేళ్ల పెట్టుబడుల కరువు నుండి కొంత ఉపశమనం పొందుతుంది అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్